నాగబాబు వచ్చేశాడు.. వర్మ రెడీనా?

నాగబాబు వచ్చేశాడు.. వర్మ రెడీనా?

రామ్ గోపాల్ వర్మ-నాగబాబుల మధ్య వ్యవహరం ఉప్పు-నిప్పులా ఉందిప్పుడు. ఒకరి మీద ఒకరు ఈ మధ్య ఎలాంటి కామెంట్లు చేసుకున్నారో తెలిసిందే. ఈ ఎపిసోడ్లో చివరగా వాయిస్ వినిపించిన నాగబాబు.. వర్మ ట్విట్టర్‌ను ఒక ఆయుధంగా వాడుతున్నాడని.. తాను ‘ఖైదీ నెంబర్ 150’ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో మైకును ఆయుధంగా వాడానని అన్నాడు. ఐతే ఇకపై ప్రతిసారీ నాగబాబు తన వాదన వినిపించడానికి ఇక వేదికలు వెతుక్కోవాల్సిన పని లేదు. ఆయన కూడా ట్విట్టర్లోకి వచ్చేశాడు. కాబట్టి ఇకపై వర్మ మెగా ఫ్యామిలీపై ఏవైనా కౌంటర్లు వేస్తే డైరెక్టుగా ట్విట్టర్లోనే ఎదుర్కొంటాడేమో.

నాగబాబు ట్విట్టర్లోకి రావడానికి వర్మనే కారణమని కూడా అనుకుంటున్నారు. ఇన్నాళ్లూ సోషల్ మీడియాకు దూరంగా ఉండిపోయిన నాగబాబు ఇప్పుడే ఉన్నట్లుండి ట్విట్టర్లోకి రావడానికి మరే కారణాలు కనిపించట్లేదు. మరి నాగబాబుకు వెల్కమ్ చెబుతూ వర్మ తనదైన శైలిలో ఏవైనా కామెంట్లు చేస్తాడేమో చూడాలి. అసలు తన కౌంటర్లకు నాగబాబు రివర్స్ కౌంటర్ ఇచ్చాక.. వర్మ మళ్లీ స్పందించలేదు. బహుశా నాగబాబు ఈసారి చాలా తగ్గి మాట్లాడేసరికి.. మళ్లీ కౌంటర్లు, కవ్వింపులు ఎందుకు అనుకున్నాడేమో.

ఏదేమైనా నాగబాబు ఇప్పుడు ట్విట్టర్లోకి రావడంతో అందరి కళ్లూ వర్మ మీదే ఉన్నాయి. మొన్నటిదాకా ఎంత గొడవైనప్పటికీ వర్మ మెగా ఫ్యామిలీని కవ్వించడం ఆపేస్తాడని అనుకోలేం. మళ్లీ సందర్భం చూసి కౌంటర్లు మొదలుపెట్టకపోడు. అప్పుడు నాగబాబు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్నది ఆసక్తికరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు