తప్పు తెలుసుకున్న రవితేజ

తప్పు తెలుసుకున్న రవితేజ

వయసు మీద పడుతోంది కనుక యంగ్‌గా కనిపించాలని ఫిట్‌నెస్‌పై అధిక శ్రద్ధ పెట్టడం మొదలుపెట్టాడు మాస్‌ మహారాజా రవితేజ. అయితే ఫిట్‌గా అయ్యే పనిలో తనకి సూట్‌ అయ్యే ఫిజిక్‌ ఏంటనేది రవితేజ లెక్కలు చూసుకోలేదు. ఫలితంగా బాగా సన్నగా అయిపోయి 'కిక్‌ 2' చిత్రంలో అదోలా కనిపించాడు. అతడిని కవర్‌ చేయడానికి సిజి నిపుణులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఆ సినిమా తర్వాత గ్యాప్‌ లేకుండా బెంగాల్‌ టైగర్‌ చేయడంతో ఇందులో కూడా రవితేజ అలానే కనిపించాడు. సినిమా ఎలా వున్నా రవితేజ లుక్‌ గురించి విమర్శలు వచ్చాయి.

ఫిట్‌గా వుండడానికి ట్రై చేస్తున్నానంటూ వాదిస్తూ వచ్చిన రవితేజ ఈ ఫీడ్‌బ్యాక్‌తో తన తప్పు తెలుసుకున్నాడు. తనకి మరీ పీలగా వుండే ఫిజిక్‌ సూట్‌ అవదని తెలిసి రావడంతో తిరిగి పూర్వ రూపానికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. బెంగాల్‌ టైగర్‌ సక్సెస్‌ మీట్‌లోనే రవితేజ ఈమధ్య కాలంలో వున్న దానికంటే బెటర్‌గా కనిపించడంతో అతని అభిమానులు ఆనందిస్తున్నారు. నెక్స్‌ట్‌ సినిమాలో రవితేజని తిరిగి ఫుల్‌ ఎనర్జీతో చూడవచ్చని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English