రవితేజ రాకుంటే స్వాతి వస్తుంది

రవితేజ రాకుంటే స్వాతి వస్తుంది

దసరా సినిమాల విషయంలో నెలకొన్న గందరగోళమే దీపావళికీ కంటిన్యూ అయ్యేట్లుంది. ఇప్పటికే అటు ఇటుగా మూణ్నాలుగు సినిమాలు దీపావళి రేసులో ఉన్నాయి. ఇంతలో ఇంకో సినిమా పండగ పోటీలోకి వచ్చేసింది. స్వాతి, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో ‘గీతాంజలి’ ఫేమ్ రాజ్ కిరణ్ దర్శకత్వం వహించిన హార్రర్ థ్రిల్లర్ ‘త్రిపుర’ను దీపావళికి ముందు వీకెండ్లో, నవంబరు 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 29న ఆడియో కూడా రిలీజ్ కాబోతోంది. ఐతే నవంబరు 6నే నిఖిల్, నందితల క్రైమ్ కామెడీ ‘శంకరాభరణం’ కూడా విడుదల కావాల్సి ఉంది.

ముందు రోజు, నవంబరు 5న ‘బెంగాల్ టైగర్’ అనుకుంటున్నారు. 10వ తారీఖున కమల్ హాసన్ ‘చీకటి రాజ్యం’ రావడం పక్కా. ఐతే 11న అఖిల్ రావొచ్చని.. దాని కోసం ‘బెంగాల్ టైగర్’ను వాయిదా వేయించాలని చూస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 6న దిగిపోవడానికి ‘త్రిపుర’ చూస్తుండొచ్చు. ‘గీతాంజలి’ సినిమాలో హార్రర్ కు కామెడీ కలిపి నవ్వించి, భయపెట్టిన రాజ్ కిరణ్.. ఈసారి కామెడీ ప్లేసులో థ్రిల్లర్ ఫ్యాక్టర్ పెట్టుకుని వస్తున్నాడు. ట్రైలర్ చూస్తే ఇంట్రెస్టింగ్‌ గానే ఉంది. ‘కార్తికేయ’ తరహాలో సైన్స్ ప్రస్తావనతో రియలిస్టిక్ గా ఉండే హార్రర్ మూవీ తీయడానికి ప్రయత్నించినట్లున్నాడు రాజ్ కిరణ్. ఐతే 5న బెంగాల్ టైగర్ రావడం ఖాయమైతే మాత్రం ‘త్రిపుర’ను వాయిదా వేసే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు