మహేష్‌ లుక్‌ అదరహో

మహేష్‌ లుక్‌ అదరహో

మహేష్‌బాబు తన తదుపరి చిత్రంలో యాక్షన్‌ హీరోగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో హాలీవుడ్‌ స్థాయి ఫైట్స్‌ ఉండబోతున్నాయి. ఇందుకోసం విదేశీ స్టంట్‌ మాస్టర్లే పని చేస్తున్నారు. సుకుమార్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రం కోసం మహేష్‌ తన ఫిజిక్‌ కూడా మార్చుకున్నాడు.

ట్వంటీ ఫోర్‌ అవర్స్‌ తనకి అందుబాటులో ఉండే ఫిజికల్‌ ట్రెయినర్‌ని పెట్టుకుని సొంత ఖర్చులతో అతడిని పోషిస్తున్నాడు. ఈమధ్య ఆధునిక పద్ధతుల్లో తన ఫిజిక్‌లో మార్పు కోసం మహేష్‌ ఒక ఫిట్‌నెస్‌ రెజీమ్‌ ఫాలో అయ్యాడు. దాని ఎఫెక్ట్‌ అతని లుక్‌లో కనిపిస్తోంది.

మహేష్‌ ఈ చిత్రంలో చాలా యంగ్‌గా, అలాగే టఫ్‌గా కూడా కనిపించబోతున్నాడు. ఇప్పటికే అమ్మాయిల మనసులు కొల్లగొడుతున్న మహేష్‌బాబు ఇక తన ఫిట్‌ బాడీతో వారిని ఇంకెంత పిచ్చోళ్లని చేస్తాడో కానీ మహేష్‌కి ఏజ్‌ పెరిగే కొద్దీ ఇంకా ఇంకా యంగ్‌ లుక్స్‌ వచ్చేస్తున్నాయి. ఇండియాలో మోస్ట్‌ డిజైర్డ్‌ మెన్‌ లిస్ట్‌లో సెకండ్‌ ప్లేస్‌లో ఉన్నాడంటే... ఉండడా మరి... ఇలాగుంటే!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు