ప్రెస్ రిలీజ్

స్టార్ మా లో “సూపర్ సింగర్ జూనియర్

ఎక్కడెక్కడో వున్న కొత్త కొత్త ప్రతిభావంతులైన గాయనీ గాయకులను పరిచయం చేయడంలో ముందుంటుంది  “స్టార్ మా”. ఎన్నో అద్భుతమైన స్వరాలను సినిమా రంగానికి పరిచయం చేసింది స్టార్ మా.

స్టార్ మా స్టార్ సింగర్ వేదిక పైన పాడిన ఎందరో ఇప్పుడు మంచి సింగర్స్ గా తమ స్వరాలను వినిపిస్తున్నారు. ఈ పరంపరలో స్టార్ మా ఇప్పుడు కేవలం పిల్లల కోసం “సూపర్ సింగర్ జూనియర్”  పేరుతో ఓ కొత్త సిరిస్ ని రూపొందించింది.  6 నుంచి 15 సంవత్సరాల పిల్లలతో జరగనున్న ఈ సిరీస్ కోరుకున్నంత వెరైటీ గా, కావాల్సినంత ఫన్ పంచడానికి సిద్ధమవుతోంది.

ఈ సిరీస్ కోసం పిల్లల నుంచి ఎంట్రీలు పంపించమని స్టార్ మా లో  ప్రోమో ప్రసారం చేసినపుడు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి 3 వేలకు పైగా ఎంట్రీ లు వచ్చాయి. వీళ్ళ నుంచి రకరకాల వడపోతలు జరిగాక 14 మంది టాప్ కంటెస్టెంట్స్ షో లో పాల్గొనే అర్హత సాధించారు.  వీళ్ళతో “సూపర్ సింగర్ జూనియర్” సిరీస్ ప్రారంభం అవుతుంది. టెలివిజన్  యువసంచలనాలు సుధీర్, అనసూయ ఈ షో ని ఎనెర్జిటిక్ గా నడిపించబోతున్నారు.

ఎన్నో భాషల్లో వేల పాటలు పాడి, ఎన్నో సినిమాలకు డబ్బింగు చెప్పిన మనో, నిత్య వసంత కోయిల చిత్ర, సెన్సషనల్ టాలెంట్స్ రెనినా రెడ్డి,  హేమచంద్ర న్యాయ నిర్ణేతలు.

“సూపర్ సింగర్ జూనియర్” – మే 22 న సాయంత్రం 6 గంటలకు అంగరంగ వైభవంగా లాంచ్ అవుతోంది. ఆ ఆ తరవాతి వారం నుంచి ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది.  

సూపర్ సింగర్ జూనియర్” ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/rrGt_GP5C_Q

Content Produced by: Indian Clicks, LLC

This post was last modified on May 22, 2022 5:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago