హీరో నందమూరి కల్యాణ్ రామ్ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 19వ చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ప్రొడకన్ నెం.14 గా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా రాజేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి బుచ్చిబాబు సానా క్లాప్ కొట్టారు. దర్శకులు భరత్ కమ్మ, రాధాకృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హీరో కల్యాణ్ రామ్, నిర్మాత నవీన్ ఎర్నేని, సీఈఓ చెర్రీ .. చిత్ర దర్శకుడు రాజేంద్రకు స్క్రిప్ట్‌ను అందించారు.
మార్చి రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సినిమాలో హీరోయిన్ సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎర్నేని అనిల్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజేంద్ర.
This post was last modified on February 15, 2021 1:15 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…