తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌కు భారీ సెగ తగిలింది. కేటీఆర్ గో బ్యాక్ నినాదాలతో ఆయన ఉలిక్కి పడ్డారు. శనివారం రాత్రి మృతి చెందిన ఢిల్లీ విశ్వ విద్యాలయం మాజీ ప్రొఫెసర్ జీ. ఎన్. సాయిబాబా భౌతిక దేహాన్ని హైదరాబాద్‌లోని మౌలాలీలో ఉన్న ఆయన నివాసంలో ఉంచారు. అభిమానులు, ఆయన పూర్వ విద్యార్థుల సందర్శన కోసం ఏర్పాట్లు చేశారు.
ఈ సమయంలో ప్రొఫెసర్ సాయిబాబా పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు కేటీఆర్ ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు. అయితే… అప్పటికే భారీ సంఖ్యలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన పూర్వవిద్యార్థులు కేటీఆర్‌ను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు.
ఈ సందర్బంగా పలువురు విద్యార్థులు `కేటీఆర్ గో బ్యాక్` అంటూ.. నినాదాలతో హోరెత్తించారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు కూడా బత్తరపోయారు. వారు తేరుకునేలోగానే విద్యార్థుల సంఖ్య, నినాదాల మోత మరింత పెరిగిపోయింది. దీంతో తెచ్చిన పూల దండలను సాయిబాబా పార్థివ దేహంపై ఉంచి.. నివాళులర్పించిన కేటీఆర్ ఆ వెంటనే అక్కడ నుంచి వెనుదిరిగారు. వాస్తవానికి ఆయన సాయిబాబా కుటుంబాన్ని పరామర్శించాలని భావించారు. కానీ, విద్యార్థుల ఆందోళనతో అసంపూర్తిగానే కేటీఆర్ కార్యక్రమాన్ని ముగించారు.
This post was last modified on October 15, 2024 11:19 am
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…