వైసీపీ అధినేత జగన్‌కు నమ్మిన బంట్లు చాలా మందే ఉన్నారు. అయితే.. ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్కరు ఉన్నారు. రాజకీయంగా కొందరు ఉంటే.. ఆధ్యాత్మికంగా కొందరు ఉన్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. కొందరు జగన్‌కు దన్నుగా ఉంటే.. ఆయన అధికారంలోకి వచ్చాక మరికొందరు ఉన్నారు. ఉదాహరణకు తిరుమలను తీసుకుంటే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రమణ దీక్షితులు జగన్‌కు మద్దతుగా వ్యవహరించారు. అదేవిధంగా విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర కూడా జగన్‌కు దన్నుగా నిలిచారు.
చిత్రం ఏంటంటే.. స్వరూపానందేంద్ర.. ఏకంగా విశాఖలో జగన్ సీఎం కావాలని కోరుతూ యాగాలు, యజ్క్షాలు చేశారు. ఇక, రమణ దీక్షితులు.. టీటీడీ నుంచి బయటకు వచ్చేసినా(2018-19 మధ్య అప్పటి బాబు ప్రభుత్వం పక్కన పెట్టింది) ఇంట్లోనే ఉండి.. శ్రీవారికి ప్రత్యేక పూజలు చేస్తూ.. జగన్ సీఎం కావాలని కోరుకున్నారు. కట్ చేస్తే.. జగన్ సీఎం అయ్యాక.. రమణ దీక్షితులు పక్కకు వెళ్లిపోయినా.. స్వరూపానంద కొనసాగుతున్నారు. ఇక, జగన్ సీఎం అయ్యాక.. ధర్మారెడ్డి టీటీడీ ఈవో పోస్టులో కి వచ్చారు.
ఆయనే అన్నీ అయి.. జగన్‌ను చూసుకున్నారు. తిరుమలను ఏకఛత్రాధిపత్యంగా ఏలారన్న విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఇక, స్వరూపానంద అయితే.. జగన్ హయాంలో తిరుగులేని ధర్మ ప్రభువుగా వినుతికెక్కారు. ఒకానొక సందర్భంలో ఆయన కర్ణాటకలో మాట్లాడుతూ.. (కన్నడం) ఏపీలో ఉన్నది మా ప్రభుత్వమే అనేశారు. ఇలా జగన్‌తో ఇద్దరూ ఆధ్యాత్మికంగా నమ్మిన బంట్లుగా మారిపోయారు. అయితే.. ఇక్కడ విశేషం ఏంటంటే.. జగన్ అధికారం కోల్పోయిన తర్వాత.. ఇద్దరూ దూరమయ్యారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదమైనప్పుడు.. కూటమి పార్టీలు జగన్, వైసీపీని ఏకేస్తుంటే.. ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. మరి దీనికి కారణం ఏంటి? దీనిపైనే ఇప్పుడు చర్చ సాగుతోంది. ధర్మారెడ్డి.. కూటమికి అనుకూలంగా మారిపోయి.. మాజీ వైసీపీ నేతతో చేతులు కలిపారన్నది ప్రస్తుతం తెరమీదికి వచ్చిన అంశం. దీంతో కూటమి కూడా ఆయనను టార్గెట్ చేయడం మానేసింది.
ఇక, ఎన్నికలకు ముందు వరకు స్వరూపానందేంద్రను టార్గెట్ చేసిన టీడీపీ నేతలు కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. దీనికి కారణం.. ఆయన టీడీపీలోని ఇద్దరు కీలక నేతలతో చేతులు కలిపారు. వీరిద్దరూ విశాఖకు చెందిన వారే. పైగా వారు చెబితే చంద్రబాబు కాదనలేరట. దీంతో స్వరూపానందేంద్ర కూడా ప్లేట్ ఫిరాయించేసి.. తనకు జగన్ హయాంలో కేటాయించిన భూములను పరిరక్షించుకునే పనిలో పడ్డారట. ఇదీ సంగతి!!
This post was last modified on October 13, 2024 6:43 pm
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…