హరియాణాలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దక్కించుకోవాలి. ఔను. నిజమే బీజేపీ పదేళ్ల పాలనపై విసిగిపోయి ఉన్న ప్రజలు ముందు అలానే అనుకున్నారు. కాంగ్రెస్ నేతలకు పట్టం కడతామని కూడా గ్రామీణ ప్రజలు చెప్పుకొచ్చారు. అందుకే.. మెలితిరిగిన.. కాకలు తీరిన సర్వేరా యుళ్లు కూడా కాంగ్రెస్‌వైపే హరియాణా మొగ్గు చూపుతోందని లెక్కలు వేశారు. కానీ, ఫలితం చూస్తే.. యూటర్న్ తీసుకుంది. కనీ వినీ ఎరుగని రీతిలో హరియాణాలో బీజేపీ మూడోసారి విజయం దక్కించుకుంది.
మరి దీనికి కారణం ఏంటి? కాంగ్రెస్ చెబుతున్న ఈవీఎంలు కాదు. సైలెంట్‌గా ఉంటూ.. తెరచాటున చక్రం తిప్పుతున్న బెహన్. ఆమే.. ఒకప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి. ఈమెనే ఉత్తరాది రాష్ట్రాలు ప్రేమగా బెహెన్ అని పిలుచుకుంటాయి. ఆమె.. చేసిన మంత్రాంగంతో కాంగ్రెస్ పూర్తిగా డీలా పడిపోయింది. తాజాగా అందుతున్న లెక్కల ప్రకారం. కీలకమైన బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును బెహెన్ భారీగా చీల్చేశారు.
దీంతో గెలుపు గుర్రం ఎక్కుతుందని అనుకున్న కాంగ్రెస్ పార్టీ అంచనాలకు భిన్నంగా ప్రతిపక్షానికే పరిమితం అయిపోయింది. ఇక్కడ కీలక అంశం ఏంటంటే.. ముందుగా కాంగ్రెస్ బీఎస్పీతో చేతులు కలిపేందుకు ముందుకు వచ్చింది. కానీ, తాము అసలు పోటీలోనే ఉండబోమని మాయావతి మాయ మాటలు చెప్పారు. కానీ.. అప్పటికే ఆమె బీజేపీతో తెరచాటు ఒప్పందం చేసుకున్నారన్నది జాతీయ విశ్లేషకుల లెక్క. ఆమె హయాంలో మధ్యప్రదేశ్‌లో జరిగిన ఏనుగు విగ్రహాల కుంభకోణం.. కొన్ని దశాబ్దాలుగా పెండింగులోనే ఉంది.
దీంతో ఆమె తరచుగా బీజేపీతో టచ్‌లోనే ఉంటున్నారు. ఇప్పుడు కూడా హరియాణాలో ఆమె ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత.. పోటీకి రెడీ అయ్యారు. అప్పటి వరకు తమతో కలిసి వస్తారని అనుకున్నా.. ఒంటరి పోరుకు బెహెన్ రెడీ అయ్యారు. అంతేకాదు.. టికెట్లు దక్కని కాంగ్రెస్ నాయకులనే ఆమె టార్గెట్ చేసుకుని బీఎస్పీ తరఫున పోటీకి పెట్టారు. అంతే.. వారి ప్రభావం.. బీఎస్పీపై సానుభూతి మొత్తంగా సర్కారు వ్యతిరేక ఓటు కాస్తా.. చీలిపోయింది. కాంగ్రెస్ పడాల్సిన ప్రతి ఓటూ.. ఏనుగు ఎక్కేసింది. ఫలితంగా కాంగ్రెస్ కుదేలైంది. మొత్తానికి బెహెన్ దెబ్బతో హస్తం.. విలవిల్లాడుతోంది.
This post was last modified on October 13, 2024 12:52 pm
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…
తీవ్ర వివాదాలు ఎదురుకుంటూ విపరీతమైన వాయిదాలకు లోనవుతూ వచ్చిన ఎమర్జెన్సీ ఇటీవలే విడుదలయ్యింది. క్రిష్ వదిలేశాక మణికర్ణిక బ్యాలన్స్ పూర్తి…
కరోనా తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిన మాట వాస్తవం. కొవిడ్ టైంలో ఓటీటీలకు బాగా అలవాటు పడ్డాక..…
ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీకి ఫౌజీ టైటిల్…
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమాలకు కాస్తంత గ్యాప్ ఇచ్చినట్టే కనిపిస్తున్నారు. ఈ సంక్రాంతికి డాకు…