ఏపీ సీఎం చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రశంసలు లభించాయి. “ఏపీలో మీ పాలన బాగుం ది. అందరినీ కలుపుకొని పోతున్నారు. ఇది మంచి ప్రభుత్వం నినాదం కూడా బాగుంది” అని చంద్రబా బుతో ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబును చిరు కలుసుకున్నారు. దసరా పండుగ సందర్భంగా ఇరువురు శుభాకాంక్షలు తెలిపుకొన్నారు. ఈ సందర్భంగా చిరుకు ఇష్టమైన అరకు కాఫీని చంద్రబాబు ప్రత్యేకంగా తయారు చేయించి ఇచ్చారు.
అనంతరం.. విజయవాడ వరద బాధితులకు సాయంగా చిరంజీవి కుటుంబం తరఫున ప్రకటించిన కోటి రూపాయల విరాళానికి సంబంధించిన చెక్కును చంద్రబాబుకు ఆయన అందించారు. ఈ సొమ్మును గత నెలలోనే ఇవ్వాలని భావించాలని.. అయితే, అనివార్య కారణాలతో కుదరలేదని చిరు చెప్పారు. తాను కూడా ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో పర్యటించాల్సి వచ్చిందని.. రాష్ట్రంలో అన్ని విధాలా వ్యవస్థలు ధ్వంసమయ్యాయని, వాటిని గాడిలో పెడుతున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముఖ్య సంస్థలు వస్తున్నాయి, 2047 విజన్ లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. యువతకు చాలా చేయాల్సి ఉందని.. వారికి ఉద్యోగంతోపాటు.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని భావించే వారిని ప్రోత్సహించాల్సి ఉందని చంద్రబాబు చెప్పారు. దీనికి తనవంతు సాయం అందిస్తానని చిరంజీవి చెప్పారు.
కాగా, తెలంగాణ, ఏపీలలో సెప్టెంబరు తొలివారంలో వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో టాలీవుడ్ ప్రముఖులు రెండు రాష్ట్రాలకు ఆపన్న హస్తం అందించారు. ఈ క్రమంలోనే చిరంజీవి ఏపీకి కోటి రూపాయలు, తెలంగాణకు కోటి రూపాయల సాయం ప్రకటించారు. ఈ నగదుకు సంబంధించిన చెక్కును ఆయన దసరా సందర్భంగా హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబుకు అందించారు. ఈ పర్యటనలో చిరు కుమార్తె కూడా పాల్గొన్నారు.
This post was last modified on October 13, 2024 4:12 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…