ధర్మారెడ్డి. దాదాపు ఈ పేరు తెలియని వారు ఉండరు. రాజకీయంగానే కాకుండా.. ఆధ్యాత్మికంగా కూడా ధర్మారెడ్డి పేరు తరచుగా వినిపించింది. వైసీపీ హయాంలో ఆయన తిరుమల శ్రీవారి ఆలయ కార్యనిర్వహ ణాధికారిగా సుమారు మూడున్నర సంవత్సరాలకు పైగానే పనిచేశారు. అయితే.. ఆయన హయాంలోనే వైసీపీపై విమర్శలు వచ్చాయి. ప్రొటోకాల్ దర్శనాల నుంచి శ్రీవాణి ట్రస్టుకు వచ్చిన భక్తుల విరాళాలను సైతం దారి మళ్లించారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి.
మరీముఖ్యంగా వైసీపీ నాయకులకు అయితే.. ఒకవిధంగా అప్పటి ప్రతిపక్ష నాయకులకు అయితే మరో విధంగా ఆయన రియాక్ట్ అయ్యారన్న వాదన కూడా ఉంది. దీంతో ధర్మారెడ్డి కేంద్రం 2022-23 మధ్య కాలంలో అనేక వివాదాలు తెరమీదికి వచ్చాయి. ప్రస్తుతం సీఎం చంద్రబాబు సైతం అప్పట్లో ధర్మారెడ్డిని కార్నర్ చేస్తూ.. విమర్శలు గుప్పించారు. కట్ చేస్తే.. రాష్ట్రంలో కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. ధర్మారెడ్డిని తప్పించేశారు. వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారన్న కారణంగా ఆయనను పక్కన పెట్టారు.
అంతేకాదు.. రెండు మాసాల కిందటి వరకు ధర్మారెడ్డిపై విచారణ చేయిస్తామని కూడా చంద్రబాబు చెప్పారు. కానీ, ఇప్పటి వరకు ధర్మారెడ్డి పేరు ఎక్కడా వినిపించడం లేదు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందన్న ఆరోపణలు భారీ ఎత్తున కుదిపేసిన సమయంలోనూ ధర్మారెడ్డి పన్నెత్తు మాట అనలేదు. అసలు ఎక్కడున్నారో కూడా మీడియా ముందుకు రాలేదు. ఇక, అంత వివాదంలోనూ.. కూటమి ప్రభుత్వం వైసీపీ ని కేంద్రంగా చేసుకుని విమర్శలు గుప్పించిందే తప్ప.. “ఏడి నాటి ఈవో ధర్మారెడ్డి?” అని ప్రశ్నించలేదు.
దీనికి కారణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వైసీపీ పాలన పోయి.. కూటమి పాలన వచ్చాక.. ముఖ్యంగా తనను టీటీడీ నుంచి తప్పించేసిన తర్వాత.. ధర్మారెడ్డి జట్టు మార్చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి దూరపు బంధువు కావడంతో ధర్మారెడ్డిని ఆయన కాపాడుతున్నారన్నది ప్రస్తుతం అంతర్గత చర్చల్లో వెలుగు చూస్తున్న విషయం. అంతేకాదు.. వేమిరెడ్డికి ఉన్న మైనింగ్ కంపెనీలకు సలహాదారుగా ఇప్పుడు ధర్మారెడ్డి వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అందుకే.. ఇంత వివాదంలోనూ ధర్మారెడ్డి పేరు కానీ.. ఊరు కానీ.. బయటకు రాలేదని చెబుతున్నారు. ఏదేమైనా.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేశారన్నది ఇప్పుడు చెబుతున్న మాట.
This post was last modified on October 13, 2024 9:58 am
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…