జగన్ పాలనలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర సందర్భంగా అప్పటి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెట్టిన సంగతి తెలిసిందే. ఆఖరుకు లోకేష్ నిల్చున్న స్టూల్ కూడా లాగేసిన పోలీసులు.. మైక్ లో మాట్లాడనివ్వకుండా ఆయనను అడ్డుకున్నారు. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో లోకేష్ తన యువగళం పాదయాత్రను పూర్తి చేశారు. ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వ అండ చూసుకొని రెచ్చిపోయిన కొందరు అధికారులు, పోలీసుల పేర్లను రెడ్ బుక్ లో రాసుకున్నానని లోకేష్ అన్నారు. రెడ్ బుక్ అని లోకేష్ బెదిరిస్తున్నారని వైసీపీ నేతలు కూడా ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆ రెడ్ బుక్ పై లోకేష్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఏపీలో రెడ్ బుక్ యాక్షన్ మొదలైందని లోకేష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
మంగళగిరి పరిధిలోని కొలనుకొండలో కియా కార్ల షోరూమ్‌ను ప్రారంభించిన తర్వాత మీడియాతో మాట్లాడిన లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్‌బుక్‌లో పేరు ఉందని కొందరు వైసీపీ నేతలు భయపడుతున్నారని, భూకబ్జాలకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని లోకేష్ హెచ్చరించారు. ఇక, మాజీ సీఎం జగన్ జిల్లాల పర్యటనకు వెళితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతినిస్తామని, కానీ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు.
విజయవాడ వరదలు, వరద సాయం, నిధులు, ఖర్చు, కూటమి ప్రభుత్వంపై ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వరదల సమయంలో జగన్ అడుగు బయటపెట్టలేదని, కానీ, వరద సాయంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి సాధించడంలో, రాష్ట్రానికి పెట్టుబడుల తెచ్చే విషయంలో పొరుగు రాష్ట్రాలతో పోటీ పడాలని అన్నారు. గత ప్రభుత్వానికి భయపడి ఏపీలో పెట్టుబడులు పెట్టకుండా వెళ్లిన వారిని వెనక్కి తెచ్చే బాధ్యత తమదని అన్నారు. టీసీఎస్, లులూ, రిలయన్స్ వంటి దిగ్గజ కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయని అన్నారు. అయితే, తమ ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా కొందరు అడ్డుకుంటున్నారని, వారిని వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు.
ఏపీకి పెట్టుబడుల వెల్లవ రావడానికి మన బ్రాండ్ అంబాసిడర్, విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కారణమని అన్నారు. ఎక్కడి వెళ్లినా చంద్రబాబు నాయుడి రాష్ట్రం అంటున్నారని, ఆయనపై ఉన్న విశ్వసనీయత, నమ్మకం అటువంటిదని లోకేష్ చెప్పారు. మన దేశంలో ఎక్కడకు వెళ్లినా కియా కార్లు కనిపిస్తున్నాయని, వాటిపై ‘మేడిన్ ఆంధ్రప్రదేశ్’ అని ఉండడం ప్రతి ఆంధ్రుడు గర్వించదగ్గ విషయమని చెప్పారు.
This post was last modified on October 12, 2024 12:42 pm
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…