తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ సీబీఐ నేతృత్వంలో సిట్ వేసింది సుప్రీం కోర్టు. మరోవైపు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న ప్రసాదానికి జరిగిన అపచారంపై వేద పండితులు, అర్చకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే ఇకపై ఏపీలో తిరుమలతోపాటు ఏ ఆలయంలోనూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పింని ప్రభుత్వం…ఆలయాల్లో అర్చకులకు సర్వాధికారాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఇకపై దేవదాయ కమిషనర్ తోపాటు ఏ స్ఠాయి జిల్లా అధికారి కూడా వైదిక విధుల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఇకపై ఆలయాల్లోని యాగాలు, కుంభాభిషేకాలు, పూజలు, తదితర సేవల్లో అధికారుల పాత్ర పరిమితంగానే ఉండనుంది. ఆయా కార్యక్రమాల్లో ఆలయ అర్చకుల పాత్రే సింహభాగం ఉండనుంది. ఆధ్యాత్మిక విధులతోపాటు వైదికపరమైన విషయాల్లో అర్చకులదే తుది నిర్ణయం.
ఆలయాల్లో అవసరమైతే ఈఓలు వైదిక కమిటీలు వేసుకునే వెసులుబాటు ఉంది. ఒకవేళ ఆధ్యాత్మిక విషయాల్లో ఏకాభిప్రాయం కుదరని పక్షంలో పీఠాధిపతుల సలహాలు తీసుకునే వెసులుబాటు ఉంది. ఆలయాల ఆగమ శాస్త్రాల ప్రకారం వైదిక విధులు నిర్వహించుకునేందుకు అర్చకులకు అవకాశం లభించింది. చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయంతో అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on October 11, 2024 11:57 am
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…