Political News

ఓడిస్తాన‌న్న పెద్దిరెడ్డి.. బాబు స‌ర్కారుకు ఓటేశారే!

పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి. వైసీపీ అగ్ర‌నేత‌, మాజీ మంత్రి. నిరంతరం.. టీడీపీపై విమ‌ర్శ‌లు గుప్పించే నాయ‌కుడు. అంతేకాదు..చంద్ర‌బాబును కుప్పంలో ఓడించి తీరుతాన‌ని శ‌ప‌థం చేసిన విష‌యం తెలిసిం దే. ఎన్నిక‌ల‌కు ముందు రెండేళ్ల నుంచి కుప్పంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టి మ‌రీ.. అక్క‌డ చంద్ర‌బాబును ఓడిం చేలా మంత్రాంగం చేసిన పెద్దిరెడ్డి.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పుతో సైలెంట్ అయిపో యారు.

ఇక‌, ఇప్పుడు చంద్ర‌బాబు స‌ర్కారు ఏర్ప‌డిన 100 రోజుల్లోనే కూట‌మి ప్ర‌భుత్వానికి మార్కులు వేస్తున్నా రు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చాలా బాగా ప‌నిచేస్తోంది! అని పెద్దిరెడ్డి చెప్పారంటేనే ఆశ్చ‌ర్యం.. విస్మ‌యం రెండూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇది నిజ‌మేనా? అంటే.. అచ్చంగా నిజ‌మే. ఆయ‌నే స్వ‌యంగా చెప్పుకొచ్చారు. పుంగ‌నూరులో ఓ చిన్నారి అశ్వియ అంజూమ్ ను ఓ మ‌హిళ అన్నం పెడ‌తాన‌ని ఇంటికి తీసుకువెళ్లి చంపేసింది. ఇది జ‌రిగి నాలుగు రోజులు అయింది.

దీనికి కార‌ణం.. చిన్నారి తండ్రి వ‌ద్ద స‌ద‌రు మ‌హిళ అప్పులు తీసుకుంది. ఈ సొమ్మును తిరిగి ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేయ‌డంతో మ‌హిళ ఈ దారుణానికి ఒడిగ‌ట్టింది. అయితే.. ఈ విష‌యం వెలుగులోకి రాగానే స‌ర్కారు హుటాహుటిన స్పందించింది. పెద్దిరెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో మ‌రింత అప్ర‌మ‌త్త‌మైంది. ఏకంగా హోం మంత్రి స‌హా చిత్తూరుకు చెందిన మంత్రులు కూడా బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. ఆర్థికంగా సాయం చేశారు.

నిందితురాలిని కూడా త్వ‌ర‌గానే పట్టుకున్నారు. నిజానికి ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చిన త‌ర్వాత విప‌క్ష నేత‌గా జ‌గ‌న్ అక్క‌డ ప‌ర్య‌టించాల‌ని అనుకున్నారు. కానీ, ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు 24 గంట‌ల ముందే.. స‌ర్కారు.. ఈ కేసును ప‌రిష్క‌రించేసింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో స్పందించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి..చంద్ర‌బాబు స‌ర్కారు బాగా ప‌నిచేసింది. అత్యంత వేగంగా స్పందించింది. ముగ్గురు మంత్రులు బాధితుల‌ను ఓదార్చారు. అందుకే.. మేం అక్క‌డకు పోలేదు అనికితాబివ్వ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ వ్యాఖ్య‌ల‌ను జ‌గ‌న్ ఎలా అర్థం చేసుకుంటారో చూడాలి.

This post was last modified on October 8, 2024 6:34 pm

Share

Recent Posts

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

2 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

3 hours ago

గంప నిండా సినిమాలు… ఎక్కడయ్యా జనాలు

ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…

3 hours ago

జనాలు పట్టేశాక నిజాలు ఒప్పుకుంటే ఎలా?

ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…

3 hours ago

త్రివిక్రమ్ బాధ్యత గురించి భేతాళ ప్రశ్న

నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం…

4 hours ago

రియాలిటీకి దగ్గరగా ఉన్నా కామెంట్స్ తప్పలేదు

నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…

4 hours ago