కేవీపీ రామచంద్రరావు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని దాదాపు ఈయనే నడిపించారన్న వాదన కూడా వినిపించింది. అయితే.. తాజాగా మరోసారి ఆయన తెరమీదికి వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు నేతృత్వంలో సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయాలకు కేవీపీ రామచంద్రరావు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ముఖ్యంగా అన్ని వైపుల నుంచి హైడ్రాపై వ్యతిరేకత రావడం, సామాన్యుల నుంచి ఆగ్రహం కూడా వ్యక్తమవడం.. మరోవైపు హైకోర్టు కూడా హైడ్రాపై సీరియస్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.
ఇలాంటి సమయంలో కేవీపీ అనూహ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. “నేను కాంగ్రెస్‌వాడినే. మీకన్నా సీనియర్ నే అయినా.. నాకు ఎలాంటి మినహాయింపులు అవసరం లేదు. నా భవనాలు కూడా బఫర్ జోన్‌లో ఉన్నాయని మీరు భావిస్తే.. అధికారులు నిర్ణయిస్తే.. వాటిని కూడా కూల్చేయండి. మీకు నా సంపూర్ణ సహకారం ఉంటుంది” అని కేవీపీ తేల్చి చెప్పారు. అంతేకాదు.. సామాన్యులను ఇబ్బంది పెట్టవద్దని ఆయన సూచించారు. సామాన్యులు రూపాయి రూపాయి పోగు చేసుకుని నిర్మించుకున్న గూడుకు ప్రభుత్వమే భద్రత కల్పించాలని సూచించారు.
ఈ విషయంలో తప్ప.. తన విషయంలో ఎలాంటి మినహాయింపులు అవసరం లేదని కేవీపీ తేల్చి చెప్పారు. తన మిత్రులు, శ్రేయోభిలాషులు కూడా.. హైడ్రాను స్వాగతిస్తున్నట్టు కేవీపీ తెలిపారు. హైడ్రా రెండో దశ ఆక్రమణల కూల్చి వేతలను కూడా ప్రారంభించాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. మూసీ నదిని సుందరంగా తీర్చిదిద్దాలన్న మీ(రేవంత్) సంకల్పం గొప్పదని కేవీపీ పేర్కొన్నారు. దీనికి తమ వైపు నుంచి కూడా పూర్తి మద్దతు లభిస్తుందన్నారు. హైడ్రాపైనా.. మీపైనా కొందరు నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తున్నారని కేవీపీ మండిపడ్డారు.
ఇలాంటి వాటిని, ఇలా విమర్శలు చేసేవారిని అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మీరు(రేవంత్) ఎంచుకున్న అభివృద్ధి దిశగా అడుగులు వడివడిగా వేయాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు కేవీపీ పేర్కొన్నారు. మూసీ నది సుందరీకరణ విషయంలో ప్రతిపక్షాలది మొసలి కన్నీరేనని విమర్శించారు. ఈ విషయం సామాన్య ప్రజలకు కూడా తెలుసునని.. అందుకే సర్కారుపై వ్యతిరేకత రాలేదని వ్యాఖ్యానించారు. “ఒక మంచి పనిచేస్తుంటే.. సైంధవులు కొందరు అడ్డు పడతారు. ఇప్పుడు మీరు కూడా అలానే ఎదుర్కొంటున్నారు. కాబట్టి మీరు చేపట్టిన పనిలో ముందుకుసాగండి. విజయం కాంగ్రెస్‌కే దక్కుతుంది” అని కేవీపీ పేర్కొన్నారు.
This post was last modified on October 4, 2024 10:41 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…