తెలంగాణ మంత్రి కొండా సురేఖ నాగార్జున ప్రస్తావనతో పాటు నాగ చైతన్య సమంతా విడాకులకు కేటీఆర్ కారణమంటూ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లోనే కాక సగటు జనంలోనూ తీవ్ర వ్యతిరేకతను తీసుకొస్తున్నాయి. అక్కినేని నాగేశ్వరరావుతో మొదలుపెట్టి అఖిల్ దాకా మూడు తరాలుగా ఆ ఫ్యామిలీలో ఏ ఒక్కరు రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయలేదు. కొందరు పొలిటీషియన్స్ తో సామాజికంగా సత్సంబంధాలు ఉండొచ్చు కానీ అవేవి వాళ్ళకు మచ్చ తెచ్చినవి కాదు. కానీ ఇప్పుడు ఒక మినిస్టర్ హోదాలోని వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం కనీసం స్వంత పార్టీ సైతం సమర్ధించలేని సిగ్గుపడే పరిస్థితిని తీసుకొచ్చింది.
గతంలో పవన్ కళ్యాణ్ మీద అప్పటి ఏపీ అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత జీవితం మీద మాటల దాడులకు పాల్పడినప్పుడు జనసేన అధినేత దాన్ని రాజకీయంగా ఎలా బదులు ఇవ్వాలో అలాగే ఇస్తూ వచ్చారు. ఏపీ డిప్యూటీ సిఎంగా పీఠం ఎక్కే వరకు ఒక స్ట్రాటజీ పాటిస్తూ వెళ్లారు. కానీ నాగార్జున అలా కాదు. అయన సినిమాలు, స్టూడియో, బిగ్ బాస్ షో, వ్యాపారాలు, కుటుంబ బాగోగులు ఇవి తప్ప వేరే ప్రపంచం లేదు. చైతు సమంతాలు విడాకులు తీసుకోవడం వాళ్ళ పర్సనల్. దాన్ని ఎక్కడా రచ్చ చేసుకోలేదు. హుందాగా విడిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయ్యారు. షూటింగ్స్ చేసుకుంటూ తమ వ్యాపకాల్లో ఉన్నారు.
ఇప్పుడు హఠాత్తుగా అభిమానుల మనసులు గాయపడేలా కేవలం వివాదం కోసమో లేదా అపోజిషన్ ని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతోనో ఒక మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల జరిగే ప్రయోజనం ఏమో కానీ డ్యామేజ్ చాలా ఎక్కువ. నాగార్జున ఇంత జరిగినా హుందాగా స్పందిస్తూ దయచేసి అవవసరంగా అబాంఢాలు వేసి మమ్మల్ని రచ్చ కీడ్చవద్దన్నారు తప్పించి ఏ పదంలోనూ నోరు జారలేదు. ఇప్పుడు ఫ్యాన్సే కాదు సగటు జనాలు కూడా సదరు మంత్రి నుంచి క్షమాపణ కోరుకుంటున్నారు. ఆధారాలు లేని ఆరోపణలతో పెద్ద సినీ కుటుంబాల గురించి ఇలాంటి ప్రచారాలు పరిచయం చేయడం ఎంత మాత్రం మంచిది కాదు.
This post was last modified on October 2, 2024 10:04 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…