తెలంగాణలో ఆక్రమణలను తొలగించడంతోపాటు మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అనేక విమర్శలు, వివాదాలు ఎదురైనా లెక్కచేయకుండా ముందుకు సాగుతున్నారు. హైడ్రాను తీసుకువచ్చి.. దాని ద్వారా కథ నడిపిస్తున్నారు. చెరువులు, కుంటల ఆక్రమణలను తొలగిస్తు న్నారు. అయితే.. ఈ వ్యవహారం.. పైకి బాగానే ఉన్నా.. పర్యావరణ ప్రేమికులు మెచ్చుకుంటున్నా.. కీలకమైన పేదలు, మధ్యతరగతి వర్గాల్లో మాత్రం కొంత వ్యతిరేకత పెల్లుబుకుతోంది.
ఈ విషయం జాతీయ మీడియా సహా స్థానిక మీడియాలోనూ ప్రధానంగా వస్తోంది. ముఖ్యంగా దుర్గం చెరువు, ఇతర పేదలు ఉండే బస్తీల్లో హైడ్రా కూల్చివేతలు ఆయా వర్గాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఈ పరిణామం.. ఓటు బ్యాంకు రాజకీయాల దిశగా అడుగులు వేస్తోంది. పేదల పక్షపాతిగా కేసీఆర్‌ను ప్రొజెక్టు చేసేందుకు బీఆర్ ఎస్ ప్రయత్నిస్తుండడం.. తాము మాత్రమే పేదల గురించిఆలోచించామని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులు ప్రకటించడం తెలిసిందే. ఈ పరిణామాలతో సహజం గానే పేదల ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు దూరమవుతుందని వీహెచ్ సహా కొందరు సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కూల్చివేతలను సమర్థిస్తూనే, చెరువులు, కుంటలు బాగుండాలని కోరుకుంటూనే పేదలకు, మధ్యతరగతి వారికి ఇబ్బంది లేని విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. కానీ, హైడ్రా ఇప్పటికే చేయాల్సింది చేసింది. దీంతో కాంగ్రెస్ పాలన అంటే కూల్చివేతలు అనే టాక్ ప్రబలి పోయింది. ఆదిలో బాగానే ఉన్నా.. ఇప్పుడు ఎవరిని కదిలించినా హైడ్రా అంటే కూల్చివేతలకు మారు పేరుగా మారిపోయింది. ఈ వ్యవహారాన్నినిశితంగా గమనిస్తున్న పార్టీ అధిష్టానం.. అసలు ఏం జరుగుతోందన్న విషయాన్ని ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు.
స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు జరుగుతుండడం.. మరోవైపు హైడ్రా దూకుడు, మూసీ నది ప్రక్షాళన వంటి అంశాలపై ఆయన అధిష్టానానికి వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఓటుబ్యాంకు కు వచ్చిన నష్టం లేదని.. అయితే.. కొంత ప్రభావం చూపించినా.. తట్టుకుని నిలబడతామన్న ధీమా ఆయన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ.. అధిష్టానం మాత్రం ఆదిలోనే హంస పాదు మాదిరిగా ఉన్న వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. దీంతో కొంత సంయమనం పాటించేలా రేవంత్‌కు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది.
This post was last modified on October 1, 2024 9:08 am
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…