“నా మతమేంటి అని అడుగుతున్నారు.. మానవత్వమే నా మతం” అంటూ నిన్నటి ప్రెస్ మీట్లో ఎంతో నాటకీయంగా మాట్లాడేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఐతే ఇలాంటి సినిమాల్లో డైలాగులుగా పెడితే బాగుంటుంది కానీ.. నిజ జీవితంలో జగన్ లాంటి వాళ్లు వాడితే విడ్డూరంగా ఉంటుంది అంటూ నెటిజన్లు నిన్నట్నుంచి తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు.
జగన్ అధికారంలో ఉండగా చేసిన పనులన్నీ గుర్తు చేస్తూ.. ఆయనకు లేనిదే మానవత్వం అంటూ విరుచుకుపడుతున్నారు. సొంత బాబాయి హత్యలో జగన్ హస్తం ఉందన్న ఆరోపణలు మొదలుకుని ఎన్నో విషయాలు గుర్తు చేస్తూ ఇదేనా మానవత్వం అని ప్రశ్నిస్తున్నారు. వివేకా హత్యలో జగన్ ప్రమేయం లేదనుకున్నా.. అసలీ కేసును ఎందుకు నీరుగార్చారు.. సొంత బాబాయిని చంపిన వాళ్లను ఎందుకు పట్టుకోలేదు అని అడుగుతున్నారు.
షర్మిళకు ఆస్తులు పంచకపోవడం.. ఆమె మీద సోషల్ మీడియాలో తన అనుచరులతో బూతులు తిట్టించడం.. చంద్రబాబు మీద కక్షగట్టి ఆధారాలు లేని కేసులో జైల్లో పెట్టించడం.. రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేయించి చిత్ర హింసలకు గురి చేయడం.. దళితుడిని చంపి ఇంట్లో డెలివర్ చేసిన ఎమ్మెల్సీకి పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం.. అమరావతి రాజధానిని నాశనం చేయడం ద్వారా వేలమంది రైతులను రోడ్డున పడేలా చేయాలనుకోవడం.. దళితుడైన డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగాడని అతడి చావు కళ్లజూడడం.. ఇలా వైసీపీ హయాంలో జరిగిన ఎన్నో ఉదంతాలను గుర్తు చేస్తూ.. ఇదేనా మానవత్వం అంటూ జగన్‌ను కడిగి పారేస్తున్నారు నెటిజన్లు.
జగన్ ఇలా బయటికి వచ్చినా.. ప్రెస్ మీట్ పెట్టినా ఆయన చెప్పే మాటలు అతిశయంగా ఉండి ట్రోల్ మెటీరియల్స్‌గా మారిపోతున్నాయనే చర్చ కూడా జరుగుతోంది.
This post was last modified on September 28, 2024 5:37 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…