భారీ వర్షాలు, వరదల వల్ల విజయవాడ నగరం కొద్ది రోజుల క్రితం చిగురుటాకులా వణికి పోయిన సంగతి తెలిసిందే. వరదలకు తోడు బుడమేరు వాగు పొంగడంతో బెజవాడ వాసులు బెంబేలెత్తిపోయారు. అయితే, అంత కష్టంలో ఉన్న తన ప్రజలను కాపాడుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగడం, ఏడు పదుల వయసులోనూ వరద నీటిలో దిగి బాధితులకు నేనున్నాను అని భరోసానివ్వడంతో వారంతా ధైర్యంతో ఆ విపత్తును ఎదుర్కొన్నారు. పది రోజుల పాటు కలెక్టరేట్ లోనే మకాం వేసిన చంద్రబాబు ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో బాధితులకు సాయమందించారు.
ఈ క్రమంలోనే వరదల నుంచే కాదు..వరద బాధితులకు వరద మిగిల్చిన ఆర్థిక ముప్పు నుంచి కూడా వారిని చంద్రబాబు బయటపడేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా వరద బాధితులకు పరిహారాన్ని యుద్ధ ప్రాతిపదికన నేడు చంద్రబాబు విడుదల చేశారు. ఈ రోజు వరద బాధితుల ఖాతాల్లోకే నేరుగా సాయం నగదును ప్రభుత్వం జమ చేసింది. వరద బాధితులకు నష్టపరిహారం పంపిణీ కార్యక్రమంలోనే సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొన్నారు. కొందరు బాధితులకు స్వయంగా చెక్కులు అందజేశారు.
సీఎం రిలీఫ్ ఫండ్ కు 400 కోట్ల రూపాయలు రావడం ఒక చరిత్ర అని చంద్రబాబు అన్నారు. వరద సహాయక కార్యక్రమాల్లో అధికారులు, మంత్రులు ఒక స్పిరిట్‌తో పనిచేశారని కొనియాడారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయని, ఆఖరు బాధితుడికి కూడా సాయం అందలన్నదే తమ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. వరద విపత్తు నుంచి చాలా త్వరగా బయటపడ్డామని, తనతోపాటు నిర్విరామంగా 11 రోజుల పాటు ఉద్యోగులంతా పని చేశారని చంద్రబాబు ప్రశంసించారు. ఇక, వరద బాధితులకు విరాళాలు ఇచ్చేందుకు సినీ, వ్యాపార ప్రముఖులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని, తన పిలుపు మేరకు వారంతా బ్రహ్మాండంగా స్పందించారని చెప్పారు. వరదలతో నష్టపోయిన వాహనాలకు బీమా చెల్లింపులు కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలోని ప్రజలకు సాయం అందనుంది. వరదల్లో గ్రౌండ్ ఫ్లోర్ మునిగినవారికి రూ. 25వేలు, ఫస్ట్ ఫ్లోర్…ఆపై అంతస్తుల్లో ఉండేవారికి రూ. 10 వేలు, షాపులు ధ్వంసమైనవారికి రూ. 25 వేలు, హెక్టారు పంటకు రూ. 25 వేలు చొప్పున పరిహారం అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మందికి ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ పంపిణీ చేయనుంది. విజయవాడ పరిధిలోనే బాధితులు సుమారు లక్షన్నర మంది ఉన్నారు. బాధితులకు ఆర్థిక సాయం కింద సుమారు రూ. 600 కోట్లను ప్రభుత్వం పంపిణి చేయనుంది.
This post was last modified on September 25, 2024 2:30 pm
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…