Political News

వ‌ర‌ద బాధితుల‌కు 25 వేల సాయం..:  చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌

విజ‌య‌వాడ, గుంటూరు, బాప‌ట్ల‌, ఏలూరు జిల్లాల్లో వ‌ర‌దల కార‌ణంగా న‌ష్ట‌పోయిన బాధితుల‌కు ఏపీ ప్ర‌భుత్వం ప‌రిహారం ప్ర‌క‌టించింది. స్వ‌యంగా సీఎం చంద్ర‌బాబు ఈ ప‌రిహారానికి సంబంధించిన ప్ర‌క‌ట‌న చేశారు. వ‌ర‌ద‌ల కార‌ణంగా స‌ర్వ‌స్వం కోల్పోయిన వారికి రూ.25000 చొప్పున సాయం అందిస్తామ‌న్నారు. గ‌తంలో ఉన్న ప్ర‌భుత్వం వ‌ర‌ద బాధితుల‌కు రూ.4000 ఇచ్చి చేతులు దులుపుకొంద‌న్నారు. కానీ, తాము మాన‌వ‌తా దృక్ఫ‌థంతో ఈ మొత్తాన్ని 6 రెట్లు పెంచి ఇస్తున్నామ‌ని తెలిపారు. కానీ, ఇది చ‌రిత్ర‌లో తొలిసారిగా ఇంత సాయం అందిస్తున్నామ‌న్నారు.

అయితే.. న‌ష్టాన్ని పూర్తిగా భ‌ర్తీ చేయ‌డం ఎవ‌రికీ సాధ్యం కాద‌ని.. బాధితులు కోలుకునేందుకు దోహ‌ద ప‌డ‌తా మ‌న్నారు. ఇక‌, పాక్షికంగా దెబ్బ‌తిన వారికి రూ.10 వేల చొప్పున ఇవ్వ‌నున్న‌ట్టు తెలిపారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్ల‌లో ఫ‌స్ట్ ఫ్లోర్‌లో ఉన్న వారికి కూడా ఈ మొత్తాన్ని అందించ‌నున్న‌ట్టు తెలిపారు. గ‌తంలో ఇలాంటి వారికి ఎలాంటి ప‌రిహారం అందేది కాద‌ని చెప్పారు. ఇక‌, రైతుల‌కు ముందుగానే ప్ర‌క‌టించిన‌ట్టు హెక్టారుకు రూ.10 చొప్పున సాయం చేయ‌నున్న‌ట్టు తెలిపారు. వాహ‌నాలుకూడా వ‌ర‌ద ప్ర‌భావంతో తీవ్రంగా దెబ్బ‌తిన్నాయ‌ని తెలిపారు.

వ‌ర‌ద కార‌ణంగా దెబ్బ‌తిన్న‌వాహ‌నాల‌కు ఇన్సూరెన్స్ ఉంటే క్ల‌యిమ్ చేసుకునేందుకు స‌ర్కారు అన్ని విధాలా స‌హ‌క‌రిస్తుందని చంద్ర‌బాబు తెలిపారు. అయిన‌ప్ప‌టికీ.. వాహ‌నాల స్థాయిని బ‌ట్టి ద్విచ‌క్ర వాహ‌నాల‌కురూ.3 వేలు చొప్పున, ఆటోలు, ట్యాక్సీల‌కు 10 వేల చొప్పున సాయం చేయ‌నున్న‌ట్టు చెప్పారు. అలాగే.. చేనేత కార్మికులు క‌నుక పూర్తిగా న‌ష్ట‌పోయి ఉంటే(బాప‌ట్ల‌లో ఎక్కువ‌గా ఉన్నారు) వారికి కూడా రూ.25 వేల చొప్పున సాయం అందిస్తామ‌ని, పాక్షికంగా న‌ష్ట‌పోయిన వీవ‌ర్స్‌కు రూ.15 వేల చొప్పున సాయం ఇస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే ఎన్యూమ‌రేష‌న్ పూర్త‌యింద‌న్నారు.

వ‌ర‌ద‌ల కార‌ణంగా ఇబ్బందులు పడ్డ ప్ర‌తి ఒక్క‌రికీ ఈ సాయం అందుతుంద‌న్నారు. అదేవిధంగా వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ప‌ది రోజుల పాటు స‌ర్కారు అన్ని విధాలా ప్ర‌జ‌ల‌ను ఆదుకుంద‌ని, నిత్యావ‌స‌రాల‌ను కూడా అందించామ‌న్నారు. పాలు, నీళ్లు, ఆహారం కూడా అందించామ‌ని చెప్పారు. స్వచ్ఛంద సంస్థ‌లు, పారిశ్రామిక వేత్త‌లు, సినీరంగానికిచెందిన‌వారు.. ఇలా అంద‌రూ ముందుకు వ‌చ్చి మాన‌వ‌త్వాన్ని చాటుకున్నార‌ని తెలిపారు. 

This post was last modified on September 17, 2024 10:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్యాన్ ఇండియా నిర్మాతకు చుక్కలు చూపించిన పోటీ

భూషణ్ కుమార్ అంటే మన ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాకపోవచ్చు కానీ ఆదిపురుష్, యానిమల్, స్పిరిట్ లాంటి భారీ ప్యాన్…

8 mins ago

రాశి ఖన్నా.. బ్రేకప్ బాధ

ఫిలిం ఇండస్ట్రీలో ప్రేమాయణాలు.. బ్రేకప్‌లు సర్వ సాధారణమే. ఐతే బాలీవుడ్లో ఈ ఒరవడి ఎక్కువ కాగా.. సౌత్ ఇండస్ట్రీల్లో కొంచెం…

1 hour ago

యూట్యూబ్ తో 43 కోట్లు సంపాదించిన 65 ఏళ్ల మహిళ

మన దేశంలో చాలామంది ఆడవాళ్లు సాధారణంగా ఐదు పదుల వయసు తర్వాత ఏ టీవీ సీరియల్సో చూసుకుంటూ మనవళ్లతో ఆడుకుంటూ…

2 hours ago

పుష్ప-2లో శ్రీలీల.. ఎవరి ఛాయిస్?

సుకుమార్ సినిమా అంటే ఐటెం సాంగ్ మాండేటరీ. ‘1 నేనొక్కడినే’ లాంటి సీరియస్ థ్రిల్లర్లో కూడా ఆయన ఐటెం సాంగ్…

2 hours ago

ఫైర్ బ్రాండ్ల‌కు పెద్ద‌పీట‌.. ఏపీ రాజ‌కీయం మ‌రింత సెగే!

టీడీపీ ఫైర్ బ్రాండ్ల‌కు సీఎం చంద్ర‌బాబు మ‌రింత పెద్ద పీట వేశారు. వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వ‌డంతో పాటు.. తాజాగా…

4 hours ago

ర‌ఘురామ‌కు డిప్యూటీ స్పీక‌ర్ వెన‌క ఏం జ‌రిగింది..?

క‌నుమూరు రఘురామ కృష్ణంరాజు తెలుగు రాజ‌కీయాల్లో ఎలాంటి సంచ‌ల‌న‌మో… ఎంత పాపుల‌రో తెలిసిందే. మ‌రీ ముఖ్యంగా గ‌త ఐదేళ్లు వైసీపీ…

5 hours ago