బీఆర్ఎస్ నాయకుల తీరుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి గురువారం చేసిన వ్యాఖ్యలను సీఎం తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే బీఆర్ ఎస్ నాయకులు ఇలా వ్యవహరిస్తున్నారని తాజాగా సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి.. తద్వారా హైదరాబాద్‌కు చెడ్డపేరు తీసుకువచ్చేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి.. లోకల్-నాన్ లోకల్ అంటూ.. తీవ్ర వ్యాఖ్యలు చేసి.. ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా.. సాధారణ జన జీవనానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. కఠినంగా వ్యవహరించాలని ఆయన డీజీపీని ఆదేశించారు. ఈ విషయంలో నాయకులు ఎంతటి వారైనా కఠినంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి విషయాన్నీ నిశితంగా గమనించాలని సూచించారు.
దారుణాలకు అవకాశం!
మరోవైపు రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అప్రమత్తమయ్యాయి. రాష్ట్రంలో విధ్వంసానికి అవకాశం ఉందని.. ఏ క్షణంలో అయినా.. దహనాలు.. అల్లర్లు చేసేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు సర్కారుకు సమాచారం అందించినట్టు తెలిసింది. అల్లర్లు తద్వారా.. జన జీవనానికి ఆటంకాలు ఏర్పరి చేందుకు కొన్ని రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయన్న సమాచారం ఉందని పేర్కొన్నట్టు తెలిసింది.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి సంఘటనలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా పోలీసులను ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి డీజీపీకి కఠిన ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం.
This post was last modified on September 13, 2024 11:42 am
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…