Political News

వైసీపీలో ఆ ఇద్ద‌రే క‌నిపిస్తున్నారు… రీజ‌నేంటి..!

విప‌క్షం వైసీపీపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు.. కీల‌క వ‌ర‌ద‌ల స‌మ‌యంలో త‌మ‌ను తాము డిఫెన్స్ చేసుకునేం దుకు.. వైసీపీ త‌ర‌ఫున కేవ‌లం ఇద్ద‌రంటే ఇద్ద‌రు నాయ‌కులు మాత్ర‌మే మాట్లాడుతున్నారు. వారిద్ద‌రూ మాజీ మంత్రులే. ఒక‌రు పేర్ని నాని, మ‌రొకరు అంబ‌టి రాంబాబు. వీరిద్ద‌రు మిన‌హా మిగిలిన వారు ఎవ‌రూ కూడా మీడియా ముందుకు రావ‌డం లేదు. డిఫెన్స్ కూడా చేసుకోవ‌డం లేదు. ఎవ‌రికి వారు మౌనంగానే ఉండిపోతున్నారు. మ‌రి దీని వెనుక రీజనేంటి? అనేది ఆస‌క్తిగా మారింది.

వాస్త‌వానికి వైసీపీకి విజ‌య‌వాడ‌లోనే ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు, మ‌ల్లాది విష్ణు వంటివారు ఉన్నారు. కీల‌క‌మైన వ‌ర‌ద‌ల స‌మ‌యంలో వారు మాట్లాడొచ్చు. కానీ, వారిద్ద‌రూ ఎక్క‌డా క‌నిపించ డం లేదు. ఇక‌, మిగిలిన నాయ‌కులు రోజా, కొడాలి నాని.. వంటివారు కూడా మౌనంగానే ఉండిపోతున్నారు. పోనీ. ప‌రిస్థితి ప్ర‌శాంతంగా ఉందా? అంటే.. అదీ లేదు. అధికార పార్టీ నుంచి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ స‌మ‌యంలో వారు ఏం చేస్తున్నార‌నేది ప్ర‌శ్న‌.

తాజాగా వైసీపీ అంత‌ర్గ‌త స‌మాచారం ప్ర‌కారం.. మాజీ సీఎం జ‌గ‌న్ అంద‌రికీ ఫ్రీహ్యాండ్ ఇచ్చార‌ని తెలిసింది. అంటే అంద‌రూ మీడియా ముందుకు వ‌చ్చి ప్ర‌స్తుత ప‌రిస్థితిపై వ్యాఖ్యానించాల‌ని.. పార్టీకి ఎదుర వుతున్న ఇబ్బందులు త‌గ్గించాల‌ని కూడా పేర్కొన్నార‌ట‌. కానీ, కేవ‌లం అంబ‌టి, నానిలు మాత్ర‌మే మీడియా ముందుకు వ‌స్తున్నారు. మిగిలిన వారు మాత్రం త‌మ‌పై ఉన్న కేసులు.. లేదా.. నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన కూట‌మి కేడ‌ర్ కార‌ణం.. వెన‌క్కి త‌గ్గుతున్నార‌ని తెలుస్తోంది.

అంటే ఒక ర‌కంగా నాయ‌కులు భ‌య‌ప‌డుతున్నార‌నేది వాస్త‌వం. ఇప్ప‌టికే త‌మ‌పై కేసులు ఉన్న నేప థ్యంలో తాము ఇప్పుడు నోరు తెరిస్తే.. ఏదో ఒక కేసు పెట్టి ఇబ్బందులు పెట్టే అవ‌కాశం ఉంటుంద‌ని ఒక‌వైపు ఆలోచ‌న‌గా ఉంటే.. మ‌రోవైపు నాయ‌కుల‌కు ఏం జ‌రిగినా.. పార్టీ అధిష్టానం సైలెంట్‌గా ఉంటున్న విష‌యాన్ని కూడా నాయ‌కులు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో త‌మ‌కెందుకు బుర‌ద అంటించుకోవ‌డం అనే ధోర‌ణిలోనే నాయ‌కులు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ కార‌ణంగానే వైసీపీలో జోష్ క‌నిపించ‌డం లేద‌ని తెలుస్తోంది.

This post was last modified on September 10, 2024 5:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అమ‌రావ‌తి రైతుల‌కు చంద్ర‌బాబు భారీ కానుక‌!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతుల‌కు సీఎం చంద్ర‌బాబు పండ‌గ పూట భారీ కానుక అందించారు. గ‌త ఏడాదిన్న‌ర‌గా నిలిచి పోయిన…

55 seconds ago

సుప్రీం లోనూ కేటీఆర్ కు బిగ్ షాక్!

బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు సంక్రాంతి వేళ భారీ ఎదురు దెబ్బ తగిలింది.…

1 hour ago

ఆ సినిమాను డిస్కౌంట్లో అయినా చూస్తారా?

క్వీన్, మణికర్ణిక లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో ఒక టైంలో బాలీవుడ్లో తిరుగులేని స్థాయిని అందుకుంది కంగనా. అప్పట్లో ఆమెకు…

1 hour ago

బ్రాహ్మ‌ణికి లోకేష్ రూ.1300 కానుక‌.. స‌తీమ‌ణి రియాక్ష‌న్ ఇదే!

సంక్రాంతి పండుగ అంటేనే అంద‌రికీ వేడుక‌. క‌లవారు.. లేనివారు అనే తేడా లేకుండా చేసుకునే పండుగ ఇది. క‌నీసంలో క‌నీసం..…

1 hour ago

45 కోట్లతో మొదటి సిక్సర్ కొట్టిన వెంకీ

రెండున్నర గంటలు అండర్ కవర్ ఆపరేషన్ చేసి సినిమా చివర్లో ట్విస్ట్ ఇచ్చే హీరోలాగా పండగ బరిలో లాస్ట్ వచ్చిన…

2 hours ago

ఎన్నికల వేళ కేజ్రీ కి ఈడీ చిక్కులు?

దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఎన్నికల హీట్ ఉడికిస్తోంది. అదే సమయంలో అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)…

2 hours ago