Political News

బ్యారేజీ-బోట్లుకు రాజ‌కీయ రంగు

విజ‌య‌వాడ‌లోని ప్ర‌కాశం బ్యారేజీకి డ్యామేజీ జ‌రిగింది. బ్యారేజీకి ఉన్న 67, 69, 70వ నెంబ‌రు గేట్ల వ‌ద్ద ఉన్న కౌంట‌ర్ వెయిట్లు(సిమెంటు దిమ్మెలు) దెబ్బ‌తిన్నాయి. దీంతో వాటిని రీప్లేస్ చేసే కార్య‌క్ర‌మాలు చురుగ్గా సాగుతున్నాయి. ప్ర‌బుత్వ స‌ల‌హాదారు, ప్రాజెక్టు గేట్ల అమ‌రిక నిపుణుడు క‌న్న‌య్య నాయుడు నేతృత్వంలో ఈ ప‌నులు వేగంగా సాగుతున్నాయి. అయితే.. 69వ నెంబ‌రు గేటు వ‌ద్ద మూడు ఐర‌న్ ప‌డ‌వ‌ల వ్య‌వ‌హారం మాత్రం రాజ‌కీయంగా దుమారం రేపుతోంది.

ఈ ఐర‌న్ బోట్లు బ‌లంగా గుద్ద‌డం వ‌ల్లే బ్యారేజీ గేట్ల‌కు న‌ష్టం వాటిల్లింద‌నేది అధికారులు చెబుతున్న మాట‌. దీనివెనుక ఎవ‌రో ఉన్నారని..వారు వైసీపీ నాయ‌కులేన‌ని టీడీపీ నాయ‌కులు చెబుతున్న వాద‌న‌. మొత్తానికి ఈ వ్య‌వ‌హారంపై విజ‌య‌వాడ పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. దీంతో వారు విచార‌ణ కూడా ప్రారంభించారు. ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం ఈ బోట్లు వైసీపీ ఎమ్మెల్సీ.. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితుడుగా ఉన్న త‌ల‌శిల ర‌ఘురాం మేన‌ల్లుడివిగా పోలీసులు గుర్తించారు.

దీంతో రాజ‌కీయ దుమారం మ‌రింత రేగింది. ఈ బోట్ల వెనుక కుట్ర కోణం ఉంద‌ని తాజాగా మంత్రి నిమ్మ‌ల రామానాయుడు వ్యాఖ్యానించారు. అంతేకాదు… వైసీపీ నాయ‌కుల హ‌స్తం కూడా ఉంద‌ని చెప్పారు. ఈ మూడు బోట్లు వైసీపీ నేత‌ల‌కు చెందిన‌వేన‌ని.. వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ఇత‌ర బోట్లు ఏవీ న‌దిలోకి రాలేద‌ని.. ఈ మూడు మాత్ర‌మే వ‌చ్చాయ‌ని.. కాబ‌ట్టి వీటి వెనుక కుట్ర కోణం ఉంద‌ని తేల్చి చెబుతున్నారు. అంతేకాదు.. ఈ బోట్లకు లంగర్ వేయకుండా కేవలం ప్లాస్టిక్ తాడుతో కట్టారంటే ఉద్దేశ పూర్వ‌క‌మేన‌ని వ్యాఖ్యానించారు.

ఇదే విష‌యంపై సీఎం చంద్ర‌బాబు కూడా గ‌త రెండు రోజులుగా తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్ర‌కాశం బ్యారేజీని కూల్చేయాల‌న్న కుట్ర ఉందని.. దీనివెనుక ఎవ‌రు ఉన్నా వ‌దిలి పెట్టేది లేద‌ని చెబుతున్నారు. ఈ ప‌రిణామాల‌తో ప్ర‌కాశం బ్యారేజీకి దిగువ‌న ఉన్న బోట్ల వ్య‌వ‌హారం రాజ‌కీయంగా ప‌లు మ‌లుపులు తిరుగుతోంది. చివ‌ర‌కు ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on September 9, 2024 5:13 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

4 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

6 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

7 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

7 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

7 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

7 hours ago