కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న త్రిభాషా సూత్రాన్ని ఆది నుంచి వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ… బీజేపీపై విమర్శలు గుప్పించారు.
తెలుగు భాష గొప్పదనం అంటే.. ఆ భాషతోపాటు భాష చరిత్రను.. సంస్కృతిని కూడా గౌరవించా ల్సి ఉందన్నారు. కానీ, ఈ విషయం తెలియని కొందరు(బీజేపీనాయకులు) హిందేనే ప్రధానమని భావిస్తారని విమర్శించారు.
తాజాగా అమెరికాలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ డల్లాస్‌లోని తెలుగువారితో భేటీ అయ్యారు. ఈ సంద ర్భంగా ఆయన త్రిభాషా సూత్రాన్ని ప్రస్తావించారు. తమిళం మాట్లాడే వారంటే ఉత్తరాది వారికి నచ్చరని.. అలాగని భాషలను ఏవగించుకుంటారా? అని ప్రశ్నించారు.
దేశంలో అందరూ సమానమేనని.. అదేవి ధంగా అన్ని భాషలూ.. సంస్కృతులు, రాష్ట్రాలు కూడా సమానమేనని చెప్పారు. జాతీయ గీతం ఏ భాషలో ఉందని చూస్తామా? అని ప్రశ్నించారు. దానిలో భాష కంటే దేశ భక్తి ప్రధానంగా చూస్తామన్నారు.
అదేవిధంగా తెలుగు భాషలోనూ.. సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర వంటివి ఉన్నాయని తెలిపారు. ఇది తెలియనికొందరు.. భాషల పేరుతో హిందీని రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఒక ప్రాంతం గొప్పదని.. ఒక హిందీనే గొప్పదని భావిస్తే.. ఇతర ప్రాంతాలను, ఇతర భాషలను కూడా తక్కువ చేసి చూసినట్టే కదా? కానీ అలాంటిదేమీ మన రాజ్యాంగంలో లేదన్నారు. ఏ భాషనైనా గౌరవించాల్సిందే నని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్క భాషా సమానమేనని రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు.
This post was last modified on September 9, 2024 5:07 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…