విజయవాడ అంటే.. వాణిజ్య కేంద్రం. విజయవాడ అంటే.. అన్ని రకాల వ్యాపారాలకు కేంద్రం. దీంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం గతం కొన్నాళ్లుగా పుంజుకుంటోంది. ముఖ్యంగా నగరంలో పరిస్థితి ఎలా ఉన్నా.. నున్న మార్గంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్-గన్నవరం ఫ్లైవోవర్.. హైదరాబాద్- ఏలూరు ఇన్నర్ రోడ్డు కారణంగా.. శివారులో ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంది. ఎటు చూసినా.. బహుళ అంతస్థులు కనిపిస్తున్నాయి.
ఇక, రాజకీయ నాయకులు.. పారిశ్రామిక వేత్తలు కూడా రైతుల నుంచి పొలాలు కొనుగోలు.. ఇన్నర్ రింగ్ రోడ్డు సహా.. రామవరప్పాడు ఫ్లైవోవర్ దిగువన కూడా భారీ ఎత్తున విల్లాలు, అపార్ట్‌మెంటులు నిర్మించారు. నిర్మిస్తున్నారు కూడా. ఇక, సింగ్‌నగర్‌కు సమీపంలో నందమూరి నగర్‌లోనూ విల్లాలు, అపార్ట్‌మెంటులు జోరుగా వెలిశాయి. మొత్తంగా చూస్తే.. రాజధాని అమరావతి కారణంగా విజయవాడ విస్తరణ అయితే పెరిగింది. గన్నవరం ఎయిర్ పోర్టుకు సమీపంలో ఉండడంతో ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద ఫ్లాట్లకు డిమాండ్ పెరిగింది.
అపార్ట్‌మెంటు ఫ్లాట్లు 35-40 లక్షల మధ్య ఉన్నవి ఇటీవల సర్కారు మారిన తర్వాత.. ఏకంగా 60 లక్షలకు వెళ్లాయి. ఇక, 1.5 కోట్లు ఉన్న విల్లాలు.. రూ.3 కోట్లకు చేరాయి. ముఖ్యంగా ఉద్యోగులు.. మధ్య తరగతి ప్రజ లు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇదిమంచిదే. తద్వారా నగర విస్తరణ పెరిగి పెరుగుతున్న జనాభాకు ఆవాసం ఏర్పడుతోంది. అయితే.. ఇక్కడే ఇప్పుడు బుడమేరు వరద పొంగింది. నడుములోతు నుంచి నిలువెత్తు వరదలు సంభవించాయి. దీంతో శివారు ప్రాంతం మొత్తం మునిగిపోయింది.
ఈ ప్రభావం ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్‌పై భారీగా పడిందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకం టే.. వందల కొద్దీ ఫ్లాట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ బడమేరు ముప్పు ఉందన్న విషయం అందరికీ తెలిసిపోయింది. ఫలితంగా మునిగిపోయిన అపార్ట్‌మెంట్లు, విల్లాలను ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాలు మీడియాలో ప్రముఖంగా వస్తుండడంతో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఘోరంగా పడిపోవడం ఖాయమని అంటున్నారు. ఏదేమైనా.. బుడమేరు తంటాతో అన్ని వ్యాపారాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.
This post was last modified on September 9, 2024 4:18 pm
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…