టీడీపీ నాయకుడు, ఎమ్మెల్యే ఆదిమూలం
పై వచ్చిన ఆరోపణలతో రాజకీయంగా వైసీపీ పుంజుకునే అవకాశం వచ్చిందనే చర్చ జరిగింది. నిన్న మొన్నటి వరకు.. వైసీపీ నాయకులు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు టీడీపీ వంతు వచ్చిందని.. వైసీపీ నాయకులు నోటికి పని చెబుతారని భావించారు. కానీ, వైసీపీ చంద్రబాబు ఛాన్స్ ఇవ్వలేదు. ఒకవైపు వరద బాధితులను ఆదుకునేందుకు ప్రాధాన్యం ఇస్తూనే.. మరోవైపు రాజకీయ దుమారం రేగకుండా చర్యలు తీసుకున్నారు.
ఆరోపణలు వచ్చిన వెంటనే ఎమ్మెల్యే అని కూడా చూడకుండా.. ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాదు.. ఆయనపై విచారణకు స్వతంత్రంగా పార్టీ తరఫున ఒక కమిటీని నియమించారు. దీంతో ఇప్పుడు వైసీపికి పనిలేకుండా పోయింది. కానీ, గతంలో దాదాపు ఇలాంటి ఆరోపణలే.. వైసీపీ నేతలపైనా వచ్చాయి. అప్పటి మంత్రులు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసరావుపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ, వారిపై చర్యలు తీసుకోలేదు.
గంట-అరగంట వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. అయినా.. అప్పట్లో సీఎం జగన్ వీటిని పట్టిం చుకోలేదు. కనీసం నాయకులను హెచ్చరించిన సందర్భాలు కూడా లేవు. అంతర్గతంగా అయినా.. చర్యలు తీసుకున్నారా? అంటే అది కూడా లేదు. ఇక, అప్పటి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఏకంగా న్యూడ్ వీడితో కలకలం రేపారు. దీనిపైనా చర్యలు తీసుకోలేదు. పైగా.. సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనను సమర్థిస్తూ.. మాట్లాడారు. ఇక, ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం ఎంత తక్కువ చెబితే అంత మంచిది.
ఇలా.. వైసీపీ నాడు అనేక ఆరోపణలువచ్చినా.. నాయకులను వెనుకేసుకు వచ్చిందే తప్ప.. ఎక్కడా వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలే లేకుండా పోయాయి. దీనికితోడు కనీసం వారి గురించి జగన్ కూడా ఎక్కడా సీరియస్ కాలేదు. కానీ, ఇప్పుడు ఘటనలో మాత్రం చంద్రరాబు వెంటనే రియాక్ట్ కావడంతోపా టు.. ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేయడం వంటివి వైసీపీకి ఛాన్స్ ఇవ్వకపోగా.. రాజకీయంగా కూడా ఆయన గ్రాఫ్‌ను పెంచాయి.
This post was last modified on September 7, 2024 11:01 am
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…