Political News

అఖిల ప్రియ మాస్ వార్నింగ్

టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు, క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వైసీపీ నాయ‌కుల కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. త‌న ద‌గ్గర కూడా రెడ్ బుక్ ఉంద‌ని.. దానిలో 100 మంది పేర్లు ఉన్నాయ‌ని.. ప్ర‌తి ఒక్క‌రి సంగ‌తి తేలుస్తాన‌ని తేల్చి చెప్పారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె.. వైసీపీ నాయ‌కుల‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఇబ్బంది ప‌డ‌తారు. ఎందుకు ప‌డ‌ర‌నుకుంటున్నారు మీరు? అని ప్ర‌శ్నించారు. అన్యాయంగా కేసులు పెట్టి త‌మ‌ను ఇరికించార‌ని తెలిపారు.

నేను ఎవ‌రినీ ఇబ్బంది పెట్ట‌న‌ని చెప్పినానా.. అధికారంలోకి వ‌స్తే.. తోలు తీస్తాన‌ని చెప్పినా క‌దా! ఇప్పుడు ఎందుకు చేయ‌ను. మంచి త‌నం చూపిస్తాన‌ని అనుకుంటున్నారా మీ ద‌గ్గ‌ర‌? అని అఖిల ప్రియ ప్ర‌శ్నించా రు. వైసీపీ అదికారంలో ఉన్న‌ప్పుడు.. ఎంతో మందిపై త‌ప్పుడు కేసులు పెట్టార‌ని, ఎంతో మంది జీవితాల‌తో ఆడుకున్నార‌ని ఆమె అన్నారు. అలాంటి వారిని ఎందుకు వ‌దిలేస్తాన‌ని ప్ర‌శ్నించారు. ఒక్కొక్క‌రికీ లెక్క చెబుతాన‌ని చెప్పా. చెప్పి తీరుతా! అని వ్యాఖ్యానించారు.

నేను వ‌దిలేస్తాన‌ని చెప్ప‌లేద‌ని.. నేను మంచిదాన్నని కూడా చెప్ప‌లేద‌ని.. త‌ప్పు చేసిన వాళ్లు భ‌య ప‌డాల్సిందేన‌ని వ్యాఖ్యానించారు. త‌ప్పు చేయ‌ని వారి జోలికి తాను రాన‌న్నారు. నా ద‌గ్గ‌ర కూడా రెడ్ బుక్ ఉంది. దీనిలో మీ(వైసీపీ నేత‌లు) పేర్ల‌న్నీ ఉన్న‌య్‌. 100 మందికి పైగానే ఉన్నాయి. కొంద‌రివి ఎందుకులే అని తీసేశా అని అఖిల ప్రియ తెలిపారు. ఓపెన్‌గా చెబుతున్నా.. నా వ‌ల్ల 100 మంది ఇబ్బందులు ప‌డ‌బోతున్నారు. చ‌ట్ట ప్ర‌కార‌మే వారిపై చ‌ర్య‌లు తీసుకుంటా అని అన్నారు.

కాగా.. అఖిల ప్రియ గ‌త చంద్ర‌బాబు హ‌యాంలో మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. గ‌త 2019 ఎన్నిక‌ల్లో ఆళ్ల‌గ‌డ్డ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత హైద‌రాబాద్ భూములకు సంబంధించి ఆమె కేసులు ఎదుర్కొన్నారు. ఆ త‌ర్వాత‌.. స్థానికంగా ఏవీ సుబ్బారెడ్డితోనూ ఆమె వివాదాలు కొన‌సాగాయి. తాజా ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న ఆమె.. మంత్రి సీటు కోసం ప్ర‌య‌త్నించారు. కానీ, ద‌క్క‌లేదు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత తొలిసారి అఖిల ప్రియ మీడియా ముందుకు రావ‌డం ఇదే!

https://fb.watch/urDrTSm2Cn

This post was last modified on September 7, 2024 10:57 am

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

1 hour ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

1 hour ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

1 hour ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

1 hour ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

4 hours ago