Political News

రూ.3300 కోట్లు.. పుకార్ మాత్ర‌మే

ఏపీలో చుట్టుముట్టిన వ‌ర‌ద‌లు.. భారీ వ‌ర్షాల కార‌ణంగా విజ‌య‌వాడ‌, గుంటూరు, ఏలూరు త‌దిత‌ర ప్రాంతా ల్లో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం సాయం చేస్తున్నా.. బాధితుల‌కు ఇంకా మెరుగై న వ‌స‌తులు క‌ల్పించాల్సి ఉంది. దీంతో స‌హ‌జంగానే రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రంపై ఆశ‌లు పెట్టుకుంటుం ది. పైగా పొత్తులో ఉన్న పార్టీ కావ‌డంతో చంద్ర‌బాబు ఆశ‌లు పెట్టుకోవ‌డంలో త‌ప్పులేదు. అయితే.. ఇప్ప‌టికే కేంద్రం సాయంచేసిందని ఏపీ బీజేపీ రాష్ట్ర చీఫ్‌.. పురందేశ్వ‌రి ప్ర‌క‌టించారు.

రెండు తెలుగు రాష్ట్రాల‌కు క‌లిపి రూ.3300 కోట్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం తాత్కాలిక సాయం ఇచ్చింద‌ని పురందేశ్వ‌రి త‌న సోష‌ల్ మీడియా ఖాతా ఎక్స్‌లో పోస్టు చేశారు. దీంతో అంద‌రూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు ప‌డుతున్న త‌ప‌న‌కు కేంద్రం స్పందించింద‌ని అనుకున్నారు. కానీ, పురందేశ్వ‌రి చేసిన ప్ర‌క‌ట‌న అనంత‌రం.. చంద్ర‌బాబు మీడియా ముందుకు వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. కేంద్రం నుంచి త‌మ‌కు రూపాయి సాయం కూడా రాలేద‌ని చెప్పారు.

తాము సాయం కోసం ఎదురు చూస్తున్నామ‌ని.. కానీ, కేంద్రం నుంచి ఇంకా రూపాయి కూడా రాలేద‌ని చెప్పిన చంద్ర‌బాబు.. పురందేశ్వ‌రి చేసిన ట్వీట్‌ను కూడా ప్ర‌స్తావించారు. రూ.3300 కోట్లు ఇచ్చార‌న్న ప్ర‌చారం వాస్త‌వం కాద‌ని.. పుకార్ మాత్ర‌మేన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాము వ‌ర‌ద న‌ష్టంపై ఇంకా ఒక అంచ‌నాకు రాలేద‌ని.. ప్రాథ‌మికంగా మాత్ర‌మే కొంత అంచ‌నాకు వ‌చ్చామ‌ని ఆయ‌న చెప్పారు. దీనిని పంపించిన త‌ర్వాతే.. సాయం అందుతుంద‌ని భావిస్తున్నామ‌న్నారు.

ఈ మ‌ధ్య‌లోనే సాయం చేశారంటూ.. జ‌రుగుతున్న ప్ర‌చారం స‌రికాద‌న్నారు. దీంతో పురందేశ్వ‌రి ప్ర‌క‌ట‌న‌, చంద్ర‌బాబు కామెంట్లు రెండూ కూడా సాయం విష‌యంలో స‌మ‌న్వ‌య లోపాన్ని ఎత్తి చూపిన‌ట్టు తెలు స్తోంది. కేంద్రం నుంచి సాయం అందితే.. ముందుగా ప్ర‌బుత్వానికి సమాచారం వ‌స్తుంది. పోనీ.. దీనికంటే ముందుగానే బీజేపీనాయ‌కురాలు కాబ‌ట్టి పురందేశ్వ‌రికి స‌మాచారం అందింద‌ని అనుకున్నా.. త‌ర్వాత గంట‌కైనా.. స‌ర్కారుకు స‌మాచారం రావాలి. అలా జ‌ర‌గ‌లేదు. పైగా సీఎం చంద్ర‌బాబే దీనిని ఖండించ‌డంతో సాయం విష‌యంలో స‌మ‌న్వ‌య‌లోపం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

This post was last modified on September 7, 2024 10:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణం అర‌బిక్ ర‌చ‌యితను అభినందించిన మోడీ!

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ కువైట్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. 43 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త ప్ర‌ధాని కువైట్‌లో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి. శ‌నివారం…

4 hours ago

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

12 hours ago

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

15 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

16 hours ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

16 hours ago