Political News

పాపం జ‌గ‌న్‌.. అడ్డంగా బుక్క‌య్యారు!

వైసీపీ అధినేత జ‌గ‌న్.. విజ‌యవాడ‌లోని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న చంద్ర‌బాబు స‌ర్కా రుపై ఏవో విమ‌ర్శ‌లు చేయాల‌ని అనుకున్నారు. ప్ర‌జ‌ల‌కు ఏమీ చేయ‌లేద‌ని.. చంద్ర‌బాబు స‌ర్కారుకు దూర దృష్టి లేద‌ని అందు కే ప్ర‌జ‌ల‌కు ఇన్ని క‌ష్టాలు వ‌చ్చాయ‌ని.. ఆయ‌న చెప్పుకొనే ప్ర‌య‌త్నం చేశారు. విమ‌ర్శ‌లు కూడా గుప్పించారు. వాస్త‌వా నికి సోమ‌వారం క‌డ‌ప ప‌ర్య‌ట‌న నుంచి నేరుగా విజ‌య‌వాడ వ‌చ్చిన‌.. జ‌గ‌న్ ఆ వెంట‌నే వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతం కృష్ణ‌లంక‌లో ప‌ర్య‌టిం చారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు బాధితుల‌ను ఆయ‌న క‌లుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా బాధిత కుటుంబంతో మాట్లాడుతూ.. గ‌తంలో త‌ను ముఖ్య‌మంత్రిగా ఉన్న సమ‌యంలో చేసిన ప‌నుల‌ను.. ఎలా ఆదుకున్న‌దీ వివ‌రించే ప్ర‌యత్నం చేశారు. ఇప్పుడు మీకు ఏమైనా అందాయా? అని ఓ యువ‌తిని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. అయితే.. ఆమె దీటుగా స‌మాధానం చెబుతూ.. పీక‌ల్లోతు నీటిలో నానుతున్నామ‌ని.. ఈ స‌మ‌యంలో ఎవ‌రు మాత్రం వ‌చ్చి సాయం చేస్తార‌ని ఎదురు ప్ర‌శ్నించారు. దీంతో జ‌గ‌న్ ఖంగుతిన్నారు. అయినా.. ఆ యువ‌తి వ‌దిలి పెట్టుకుండా.. పీక‌ల్లోతు నీరుంది క‌దా.. వాళ్లు మాత్రం ఎలా వ‌స్తారు? అని మ‌ళ్లీ మ‌ళ్లీ చెప్పుకొచ్చారు.

వాస్త‌వానికి రాజ‌కీయాలు అన్ని చోట్లా చేయ‌డం సాధ్యం కాదు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాలకు వెళ్లిన‌ప్పుడు వారి స‌మ‌స్య‌లు తెలు సుకుని.. వారి క‌ష్ట‌సుఖాలు తెలుసుకుని జ‌గ‌న్ వ‌చ్చేసి ఉంటే బాగుండేది. కానీ, అలా కాకుండా.. త‌న ప్ర‌భుత్వంలో అంతా మం చే జ‌రిగింద‌ని.. ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ధోర‌ణిలో ఆయ‌న మాట్లాడ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. దీంతోనే స‌ద‌రు యువ‌తి అలా వ్యాఖ్యానించి ఉంటుంద‌ని భావించాలి. నిజానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఎవ‌రూ ఎక్క‌డ‌కి క‌ద‌ల్లేని ప‌రిస్థితి నెల‌కొంది. అయినా.. కూడా చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగానే ముందుకు సాగుతున్నారు. ఈ విషయాన్ని గ్ర‌హించ‌ని జ‌గ‌న్‌.. చంద్ర‌బాబును మైన‌స్ చేయాల‌ని అనుకుని.. ఇలా న‌వ్వుల పాల‌య్యారు.

This post was last modified on September 3, 2024 9:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగనన్న కాలనీలు కాదు… మరేంటి!

ఏపీలోని కూటమి సర్కారు సంక్రాంతి సంబరాల ముంగిట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని దాదాపుగా…

26 minutes ago

‘ఫన్ బకెట్’ భార్గవ్ కు 20 ఏళ్ల జైలు

ఇప్పుడంటే సోషల్ మీడియా ఓ రేంజిలో ప్రతాపం చూపుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి తాను కూడా…

27 minutes ago

రఘురామను హింసించిన వ్యక్తికి టీడీపీ ఎమ్మెల్యే పరామర్శ?

ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసి బాబుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వైసీపీ అదికారంలో ఉండగా… సీఐడీ ఛీఫ్ గా…

40 minutes ago

కాంగ్రెస్ ఒంట‌రి.. రాహుల్ స‌క్సెస్‌పై ఎఫెక్ట్‌!

జాతీయ‌స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మ‌రోసారి ఒంట‌రి ప్ర‌యాణాన్ని త‌ప్పించుకునేలా క‌నిపించ‌డం లేదు. ఏడాదిన్న‌ర కింద‌టి వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ ఒంట‌రిగానే…

1 hour ago

పిఠాపురంలో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌… రీజ‌నేంటి?

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పిఠాపురంలో ఆక‌స్మికం గా ప‌ర్య‌టించారు. వాస్త‌వానికి…

2 hours ago

టీటీడీ చైర్మన్, ఈవో కూడా సారీ చెప్పాలన్న పవన్

తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటన సంచలనం రేపింది.…

2 hours ago