రాష్ట్ర రాజకీయాల్లో విచిత్రమైన పరిస్ధితి కనిపిస్తోంది. వైసిపి అధికారపార్టీ అయితే టిడిపి ప్రధాన ప్రతిపక్షమన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక బిజెపి+జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్ ప్రతిపక్షాల క్రిందే లెక్క. ఓట్లు, సీట్లు లెక్క తీసుకుంటే వీటిల్లో దేనికి కూడా ప్రతిపక్ష హోదా దక్కదు. కానీ వాటితో సంబంధాలు లేకుండా ప్రతిపక్షం ప్రతిపక్షమే అంటే మాత్రం పై పార్టీలన్నీ లెక్కలోకి వస్తాయి. ఇటువంటి నేపధ్యంలోనే బిజెపి నేతల తాజా ప్రకటనలను చూస్తే తెలుగుదేశంపార్టీని వాళ్ళసలు ప్రతిపక్షంగానే గుర్తిస్తున్నట్లు అనిపించటం లేదు.
తాజాగా ఏర్పాటైన బిజెపి జాతీయ కార్యవర్గంలో జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాట్లాడుతూ తమ ప్రధాన ప్రత్యర్ధి వైసిపినే అని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షం అయినా టిడిపి తమకు ప్రత్యర్ధే కాదని చెప్పటమే విచిత్రంగా ఉంది. మొన్నటి ఎన్నికల్లో టిడిపికి సుమారు 38 శాతం ఓట్లొచ్చాయి. 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలు గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే బిజెపి విషయానికి వస్తే వచ్చిన ఓట్లు 0.84 శాతం. నన్ ఆఫ్ ది ఎబోవ్ (నోటా)కు కూడా బిజెపికన్నా ఎక్కువ ఓట్లే వచ్చాయి. అంటే బిజెపి పరిస్ధితి ఏమిటో అర్ధమైపోతోంది.
ఇటువంటి బిజెపి కూడా టిడిపిని లెక్కలేనట్లుగా మాట్లాడుతుంటే అందరు ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్ర కమలంపార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఇదే పద్దతిలో మాట్లాడుతున్నారు. టిడిపిని దెబ్బతీస్తామని వీర్రాజు చెప్పటమే విచిత్రంగా ఉంది. ఏదో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత, మొన్నటి ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు చేసిన పొరబాట్ల వల్ల ఘోరంగా ఓడిపోయుండచ్చు. అంతమాత్రాన టిడిపిని బొత్తిగా తీసిపారేయటం సాధ్యంకాదు. ఎందుకంటే బలమైన క్యాడర్ బేస్ ఉన్న పార్టీ అన్న విషయం మరచిపోకూడదు.
నిజానికి బిజెపిలో కీలక నేతలుగా చెలామణి అవుతున్న చాలామంది నేతలకు అసలు జనబలమే లేదన్నది వాస్తవం. జాతీయ కార్యదర్శిగా తన పదవిని దక్కించుకున్న సత్యకుమార్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరన్న విషయం కూడా చాలామందికి తెలిసుండకపోవచ్చు. మామూలు జనాలెవరకి సత్యకుమార్ అంటే ఎవరో కూడా తెలీదేమో. ఇలాంటి నేతలు కూడా తమ ప్రత్యర్ధి వైసిపినే అని చెప్పటమంటే కామిడి చేయటమే.
This post was last modified on September 28, 2020 7:49 pm
శ్రీవిశ్వావసు నామ తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది ఉత్సవాలను నిర్వహించారు.…
ఇవాళ సల్మాన్ ఖాన్ సికందర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. ప్రమోషనల్ కంటెంట్ బజ్ ని పెంచలేకపోయినా కండల వీరుడి మాస్…
ఏపీ సీఎం చంద్రబాబు ఉగాదిని పురస్కరించుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు వారి పండుగలలో ప్రధంగా వచ్చే ఉగాదిని పురస్కరించుకుని…
నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ఇకపై ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశమే లేదు. అంతేనా… అమరావతిని ఏపీకి రాజధానిగా…
అనూహ్యంగా రాజకీయ రంగు పులుముకున్న ఎల్2 ఎంపురాన్ కంటెంట్ గురించి అభ్యంతరాలు తలెత్తి దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్, రచయిత గోపి…
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) - సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి మధ్య తాజా వివాదం తీవ్రంగా మారేలా కనిపిస్తోంది. ఉచిత…