ప్రతిపక్ష వైసీపీకి అలాంటి ఇలాంటి షాక్ కాదు.. పెద్ద భారీ షాకే తగిలింది. ఆయన ఏరికోరి ఎంచుకుని మరీ శాసన మండలికి పంపించిన ఇద్దరు తాజాగా రిజైన్ చేశారు. అది కూడా ఎలాంటి హడావుడీ లేకుండా.. ఎలాంటి వార్తలు లీక్ చేయకుండా.. సైలెంట్‌గా తమ పదవులకు రాజీనామా చేసేశారు. వారు నేరుగా శాసన మండలికి వచ్చి.. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో చైర్మన్.. మోషేన్‌రాజుకు తమ రాజీనామా పత్రాలను అందించారు.
ఆ వెంటనే వైసీపీకి కూడా రాజీనామా చేసేశారు. వారే.. ఒకరు కర్రి పద్మశ్రీ, మరొకరు బల్లి కళ్యాణ చక్రవర్తి. ఇద్దరినీ కూడా.. జగన్ ఏరికోరి మండలికి పంపించారు. అంతేకాదు.. మంచి భవిష్యత్తు కూడా ఉంటుందని చెప్పారు. వీరిలో కర్రి పద్మశ్రీ.. గత ఏడాది ఆగస్టులో మండలికి ఎంపికయ్యారు. బల్లి కళ్యాణ్ చక్రవర్తి మాత్రం 2021, మార్చి 31న మండలికి ఎన్నికయ్యారు. అయితే.. వీరిద్దరికీ ..ఎన్నికల సమయంలో టికెట్ లు ఇవ్వలేదు. బహుశ ఆ ఆవేదనతోనే ఇద్దరూ రిజైన్ చేసి ఉంటారని తెలుస్తోంది.
ఎవరు వీరు?
కర్రి పద్మశ్రీ: కాకినాడ జిల్లాకు చెందిన పద్మశ్రీ.. ఆది నుంచి వైసీపీలో కీలక కార్యకర్తగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె సేవలను గుర్తించిన జగన్.. గత ఏడాది ఆగస్టులో గవర్నర్ కోటాలో ఖాళీ అయిన.. మండలి సీటుకు(టీడీపీ నేత, ప్రస్తుత మంత్రి ఫరూక్) ఆమెను నామినేట్ చేశారు. దీంతో ఆమె గత ఏడాది ఇదే నెలలో మండలికి ఎంపికయ్యారు. ఎన్నికల సమయంలో టికెట్ కోరినట్టు సమాచారం. కానీ, జగన్ ఇవ్వలేదు.
బల్లి కల్యాణ్ చక్రవర్తి: వీరిది బలమైన రాజకీయ కుటుంబం. గూడూరు నుంచి వరుస విజయాలు అందుకున్న బల్లి దుర్గాప్రసాదరావు తనయుడే చక్రవర్తి. గతంలో సుదీర్ఘ కాలం టీడీపీలో ఉన్నారు పార్టీ ఓడినా.. ఆయన గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో 2019లో చంద్రబాబుతో విభేదించి.. తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి దుర్గా ప్రసాద్ వైసీపీ టికెట్‌పై పోటీ చేశారు. గెలిచారు కూడా.
అయితే.. హఠాన్మరణంతో ఆయన కుమారుడు చక్రవర్తి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే.. అప్పటి ఉప ఎన్నికలో ఆయనకు టికెట్ ఇవ్వకుండా.. జగన్ ప్రస్తుత ఎంపీ, డాక్టర్ గురుమూర్తికి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల కోటాలో చక్రవర్తిని మండలికి పంపించారు. 2021లోనే మండలికి వచ్చిన చక్రవర్తిఇప్పుడు చెప్పా పెట్టకుండానే గుట్టు చప్పుడు కాకుండానే రాజీనామా చేశారు.
This post was last modified on August 30, 2024 2:45 pm
ఇప్పటి ట్రెండ్ లో హీరోయిజం అంటే ఎంత హింస ఉంటే అంత కిక్కని భావిస్తున్నారు దర్శకులు. ఎమోషన్, యాక్షన్ కన్నా…
సంక్రాంతి పండక్కు అందరికంటే ముందు వస్తున్న ఆనందం, అడ్వాంటేజ్ రెండూ గేమ్ ఛేంజర్ కు అనుకూలంగా ఉంటాయి. టాక్ పాజిటివ్…
టాలీవుడ్లో సమస్యలు ఎదురైనప్పుడు.. వాటిని పరిష్కరించే వ్యూహాలు.. చతురత ఉన్న ప్రముఖుల కోసం.. ఇప్పుడు నటులు, నిర్మాతలు ఎదురు చూసే…
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…
‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ…