పార్టీలు మారడం, రాజకీయంగా కొత్త రుచులు చూడడం ఇప్పటి నేతలకు అలవాటే. అవకాశం-అధికారం.. ఈ రెండు కీలక సూత్రాలుగా నాయకులు తమ దారులు తాము చూసుకునేరోజులు ఇవి. ఈ క్రమంలో పార్టీలు మారుతున్నా.. ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు. ఇక, ఇప్పుడు మరో ఛాన్స్ కోసం అంటూ.. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి.. టీడీపీ నుంచి జంప్ చేసేందుకు రెడీ అయ్యారనే వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్‌లో ఆమె చక్రం తిప్పారు. బాపట్ల నుంచి ఎంపీగా గెలిచి.. కేంద్రంలో మంత్రి పదవిని కూడా అందుకున్నారు. అయితే, రాష్ట్ర విభజన నేపథ్యంలో.. రాజకీయం ఆమె టీడీపీ లోకి జంప్ చేశారు.
ఈ క్రమంలో గత ఏడాది తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేశారు. అయితే, ఆమె ఓటమిపాలయ్యారు. ఇక, అప్పటి నుంచి మౌనంగా ఉన్నారు. పార్టీలో యాక్టివ్‌గా లేరు. ఇక, ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే రెండు మూడు మాసాల్లో దీనికి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో మళ్లీ టీడీపీ తరఫున టికెట్ ఇచ్చినా.. గెలుస్తానో.. లేదో నని భావిస్తున్న పనబాక లక్ష్మి.. పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తిరుపతి ఉపపోరులో అసలు టీడీపీ పాల్గొనే అవకాశం ఉండదని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే బీజేపీ వైపు లక్ష్మి చూస్తున్నారు. గతంలో ఇక్కడ బీజేపీ గెలుపు గుర్రం ఎక్కిన చరిత్ర ఉండడం, ప్రస్తుతం పార్టీ కేంద్రంలో బలంగా ఉండడంతో పాటు.. రాష్ట్ర నాయకత్వం కూడా ఉద్యమాల బాటపట్టిన నేపథ్యంలో బీజేపీ పుంజుకుందనే భావన వ్యక్తమవుతోంది. ఇక్కడ నుంచి తాను ఎంపీగా పోటీ చేసి విజయం సాధిస్తే.. ఏపీ తరఫున బీజేపీ ఎంపీగా కేంద్రంలో చక్రం తిప్పేందుకు అవకాశం ఉంటుంద ని లక్ష్మి భావిస్తున్నట్టు తెలుస్తోంది.
పార్టీ మారేందుకు ఆమె రెడీగానే ఉన్నప్పటికీ.. బీజేపీ నేతలు ఆమెకు రెడ్ కార్పెట్ పరుస్తారా? అనేది చూడాలి. దాదాపు ఆమెను పార్టీలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. దీనిపై తిరుపతి బీజేపీ కీలక నాయకుడు భాను ప్రకాశ్ రెడ్డి కూడా ఎవరు వచ్చినా చేర్చుకుంటాం.. అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలు లక్ష్మి చేరికకు ఇబ్బందులు లేవనే సంకేతాలు ఇస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on September 28, 2020 11:35 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…