Political News

పోల‌వ‌రం సొమ్ములూ దోచేశారు: చంద్ర‌బాబు

ఏపీ ప్ర‌జ‌ల జీవ‌నాడి .. పోల‌వ‌రం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు ఏపీ సీఎం చంద్ర‌బాబు చెప్పారు. బుధ‌వారం నిర్వ‌హించిన కేబినెట్ భేటీ అనంత‌రం.. ఆయ‌న మీడియాతో మాట్లాడా రు. ఈ సంద‌ర్భంగా గ‌త వైసీపీ పాల‌న‌లో పోల‌వ‌రం ఎలా ధ్వంస‌మైందీ.. ఆయ‌న వివ‌రించారు. అంతేకాదు.. త‌మ హ‌యాంలో ప్రాజెక్టును ఎలా అభివృద్ధి చేయాల‌ని భావించింది, అనే విషయాన్నీ కూడా పేర్కొన్నారు. కానీ.. వైసీపీ అన్నీ ఛిద్రం చేసింద‌ని చెప్పారు.

2014లో ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసే ముందే.. తాను ముంపు మండ‌లాల‌ను ఏపీలో విలీనం చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఏపీకి తీసుకువ‌చ్చాన‌ని చంద్ర‌బాబు చెప్పారు. అలా చేయ‌డం వ‌ల్లే.. ఏపీలో పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా.. ఇబ్బంది లేకుండా పోయింద‌న్నారు. ఇది దూర‌దృష్టితో తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని తెలిపారు. అయితే.. వైసీపీ మాత్రం దీనికి విరుద్ధంగా.. వ‌చ్చీ రావ‌డంతోనే.. ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కీ ఎక్క‌డంతోనే.. పోల‌వ‌రం విధ్వంసానికి పూనుకొంద‌న్నారు.

2019లో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌తలు చేప‌ట్టిన వెంట‌నే.. పోల‌వ‌రం కాంట్రాక్టు సంస్థ‌ను త‌క్ష‌ణం అక్క‌డ నుంచి త‌ప్పించార‌ని.. దీనికిగాను.. అప్ప‌టిక‌ప్పుడు జీవోలు కూడా పాస్ చేశార‌ని అన్నారు. కానీ, ఇలా చేయొద్ద‌ని కేంద్ర ప్ర‌భుత్వం స‌హా ఇంజ‌నీరింగ్ నిపుణులు కూడా హెచ్చ‌రించినా.. ప‌ట్టించుకోలేద‌న్నారు. ఇక‌, కేంద్ర ప్ర‌భుత్వం మొత్తం ఈ ప్రాజెక్టు కోసం.. ఇచ్చిన సొమ్మును కూడా దారి మ‌ళ్లించార‌ని చంద్ర‌బా బు ఆరోపించారు. ప్ర‌స్తుతం కాంట్రాక్టు సంస్థ‌కు 3 వేల కోట్ల వ‌ర‌కు బ‌కాయి పెట్టార‌ని అన్నారు.

ఈ సొమ్ము లు ఇప్పుడు చెల్లించాల్సి ఉంద‌ని.. మ‌రి కేంద్రం ఇచ్చిన సొమ్ము ఏమైంద‌ని.. వాటిని ఎటు మ‌ళ్లించార‌ని ప్ర‌శ్నించారు. ఇన్ని త‌ప్పుల‌ను స‌రిచేసుకునేందుకు తాను చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. ప్ర‌స్తుతం పోల‌వ‌రం స‌మ‌స్య‌లు కొలిక్కి వ‌స్తున్నాయ‌ని. 2027 నాటికి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. 

This post was last modified on August 28, 2024 9:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ముర‌ళీమోహ‌న్ అంత‌రంగం.. అయితే, అదే పెద్ద స‌మ‌స్య‌!

ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు, నిర్మాత‌, వ్యాపార వేత్త ముర‌ళీమోహ‌న్‌.. తాజాగా చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…

1 hour ago

ఆ రోజుల్లో… శ్రీవారు క‌నిపించేది సెక‌నంటే సెక‌నే!!

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం అంటే.. ఓ 2 నిమిషాలు ల‌భిస్తుంద‌ని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్న‌గారు ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా…

2 hours ago

బ్రేకింగ్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…

3 hours ago

అప్ప‌టి వ‌ర‌కు చెప్పులు వేసుకోను: అన్నామ‌లై

రాజ‌కీయ నేత‌లు స‌వాళ్లు చేయ‌డం తెలుసు. అదే విధంగా ప్ర‌తిజ్ఞ‌లు చేయ‌డం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…

5 hours ago

చరణ్ కి పోటీగా సోనూసూద్ – చిరంజీవి రియాక్షన్

గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…

6 hours ago