తెలంగాణలో ‘భూ’కంపం సృష్టిస్తున్న హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్- అసెట్ ప్రొటెక్షన్, అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ) ఏపీలోనూ తీసుకురావాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. ఏపీలోనూ అక్రమ నిర్మాణాలను తొలగించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో హైడ్రా తరహా వ్యవస్థను ఏపీలో కూడా తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తు న్నామని చెప్పారు.
అయితే.. ఈ ప్రకటన బాగానే ఉన్నా.. అనేక మంది రాజకీయ నాయకులు.. పారిశ్రామిక వేత్తలతో ముడిపడిన ఈ వ్యవహారంలో ముక్కు సూటిగా ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో జగన్ ఇదే తరహా ప్రయత్నం చేసి.. అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. అక్రమాలు నిజమే అయినా.. ఆక్రమణలు కళ్లముందే కనిపిస్తున్నా.. రేవంత్ రెడ్డి మాదిరిగా చర్యలు తీసుకునే పరిస్థితి అయితే.. ఏపీలో కనిపించడం లేదు.
ఎందుకంటే.. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నవారు.. ఇప్పుడు కూడా యాక్టివ్‌గా ఉన్నారు. కూటమి సర్కారును ఏర్పాటు చేయడంలోనూ వారి పాత్ర కీలకం. హైదరాబాద్‌లో మాదిరి రాజకీయం ఇక్కడ పని చేసే పరిస్థితి లేదు. అందుకే.. జగన్ ఎన్నో ప్రయోగాలుచేసినా.. ఇక్కడ సక్సెస్ కాలేక పోయారు. ప్రజావేది కను కూల్చేసిన తర్వాత.. అనేక నిర్మాణాలపై కసరత్తు చేశారు. కానీ, ఇంతలోనేపలువురు కీలక పారిశ్రామిక వేత్తలు హైకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు.
ఆనాటి స్టే ఆర్డర్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు దానిని పక్కనపెట్టి.. హైడ్రా వంటి సంస్థను తీసుకువచ్చినా.. చర్యలు మాత్రం శూన్యమేనని చెప్పాలి. కాబట్టి ఇది కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుంది తప్ప.. కార్యాచరణ మాత్రం సాధ్యం కాదు. ఈ విషయం సర్కారు కు తెలియంది కాదు. అయితే.. ఇక,నుంచైనా ఆక్రమణలు తగ్గుతాయన్న ఉద్దేశంతోనే ఇలా ప్రకటించి ఉంటారన్నది ఇప్పుడు చర్చకు వస్తోంది. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on August 28, 2024 2:25 pm
ఇప్పటి ట్రెండ్ లో హీరోయిజం అంటే ఎంత హింస ఉంటే అంత కిక్కని భావిస్తున్నారు దర్శకులు. ఎమోషన్, యాక్షన్ కన్నా…
సంక్రాంతి పండక్కు అందరికంటే ముందు వస్తున్న ఆనందం, అడ్వాంటేజ్ రెండూ గేమ్ ఛేంజర్ కు అనుకూలంగా ఉంటాయి. టాక్ పాజిటివ్…
టాలీవుడ్లో సమస్యలు ఎదురైనప్పుడు.. వాటిని పరిష్కరించే వ్యూహాలు.. చతురత ఉన్న ప్రముఖుల కోసం.. ఇప్పుడు నటులు, నిర్మాతలు ఎదురు చూసే…
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…
‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ…