టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ తరచుగా చెబుతున్న మాటే .. మరోసారి అనేశారు. అదే `రెడ్ బుక్`! యువగళం పాదయాత్ర చేసినప్పుడు.. నారా లోకేష్ తమను ఇబ్బందులు పెట్టిన వారి పేర్లను రెడ్ బుక్‌లో నమోదు చేసుకున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక వారిని ఎలా శిక్షించాలో అలానే శిక్షిస్తామని కూడా చెప్పారు. ఇక, అధికారంలోకి వచ్చాక.. జరుగుతున్న పరిణామాలు.. నమోదవుతున్న కేసులను చూస్తే రెడ్‌బుక్ అమలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
అయితే.. దీనిని నారా లోకేష్ ఏమీ తోసిపుచ్చడం లేదు. ఔను! రెడ్ బుక్‌లో ఉన్న వారిని వదిలి పెట్టబోమని ఆయన చెబుతున్నారు. జోగి రమేష్ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరకు అనేక మంది పేర్లు రెడ్ బుక్‌లో ఉన్నాయన్న ప్రచారం కూడా ఉంది. వారిపై ప్రస్తుతం విచారణలు కూడా సాగుతున్నాయి. అయితే.. మరింత మంది పేర్లు రెడ్‌బుక్ లో ఉన్నాయన్నది.. టీడీపీ నాయకులు చెబుతున్న మాట. దీనికి దన్నుగా ఇప్పుడు నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంగళగిరిలో నిర్వహించిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్.. రెడ్‌బుక్‌లో పేరు ఉన్న ప్రతి ఒక్కరిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని తెలిపారు. ఐఏఎస్ లు, ఐపీఎస్‌లను కూడా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. రెడ్ బుక్‌లో ఉన్నవారంతా.. టీడీపీని, పార్టీ నాయకులను, ప్రజలను ఇబ్బంది పెట్టిన వారేనని తెలిపారు. ఎందుకు వదిలేస్తామని ప్రశ్నించారు. రెడ్ బుక్ అమలు చేయాలని ప్రజలు కూడా కోరుకుంటున్నట్టు చెప్పారు. అందుకే తాము చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
This post was last modified on August 28, 2024 7:55 pm
శాసన సభ సమావేశాలను వైసీపీ బాయ్ కాట్ చేయడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తమకు మైక్ ఇవ్వడం లేదని…
భూషణ్ కుమార్ అంటే మన ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాకపోవచ్చు కానీ ఆదిపురుష్, యానిమల్, స్పిరిట్ లాంటి భారీ ప్యాన్…
ఫిలిం ఇండస్ట్రీలో ప్రేమాయణాలు.. బ్రేకప్‌లు సర్వ సాధారణమే. ఐతే బాలీవుడ్లో ఈ ఒరవడి ఎక్కువ కాగా.. సౌత్ ఇండస్ట్రీల్లో కొంచెం…
మన దేశంలో చాలామంది ఆడవాళ్లు సాధారణంగా ఐదు పదుల వయసు తర్వాత ఏ టీవీ సీరియల్సో చూసుకుంటూ మనవళ్లతో ఆడుకుంటూ…
సుకుమార్ సినిమా అంటే ఐటెం సాంగ్ మాండేటరీ. ‘1 నేనొక్కడినే’ లాంటి సీరియస్ థ్రిల్లర్‌లో కూడా ఆయన ఐటెం సాంగ్…
టీడీపీ ఫైర్ బ్రాండ్లకు సీఎం చంద్రబాబు మరింత పెద్ద పీట వేశారు. వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడంతో పాటు.. తాజాగా…