తెలంగాణలో టిడిపిని పుంజుకునేలా చేయాలనేది చంద్రబాబు వ్యూహం, ఈ క్రమంలోనే ఆయన ఏపీలో పార్టీ విజయం సాధించిన తర్వాత వరుసగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణ పార్టీని గాడిలో పెట్టడంతో పాటు త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయాలనేది కూడా చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలను రద్దు చేశారు. త్వరలోనే కొత్త కమిటీలను ఎంపిక చేస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
అయితే పార్టీ పుంజుకుంటుందా పుంజుకోదా అనేది పక్కన పెడితే ప్రజల్లో అసలు టిడిపి గురించి చర్చ అయితే రావాల్సి ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, అంతకు ముందు ప్రతిపక్షం లో ఉన్నప్పుడు పార్టీ అసలు స్తబ్దుగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు దాదాపు గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాం తాల్లో కూడా హైదరాబాద్ మినహా మిగిలిన చోట్ల టిడిపి గురించి పెద్దగా చర్చ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పార్టీని ప్రజలు చర్చించుకోవాల్సిన విధంగా ముందుకు నడిపించాల్సి ఉంటుంది.
దీనికిగాను ఇప్పుడు ఏం చేయాలి అంటే.. ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేకంగా నిర్ణయాలు ఉంటే వాటిమీద తప్పకుండా పోరాటాలు చేయటం అదేవిధంగా ప్రజా సమస్యలపై స్పందించడం ఉద్యమాలు నిర్మించడం వంటివి కచ్చితంగా చేయాలి. అదేవిధంగా వారానికి రెండు సార్లు అయినా పార్టీ తరఫున ప్రెస్ మీట్ లు పెట్టడం ప్రజా సమస్యలను ప్రస్తావించడం ప్రభుత్వం నిర్ణయాలు కనుక ప్రజలకు వ్యతిరేకంగా ఉండి వారి ఇబ్బంది పడుతుంటే వాటిని కూడా ప్రస్తావించే విధంగా వ్యవహరించాలి.
ఇది మానేస్తే పార్టీ ప్రజల్లోకి వెళ్లడం చాలా కష్టంగా మారుతుంది. గతంలో కూడా పార్టీ ఇలాంటి తప్పులే చేసింది. బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించే విషయంలో పార్టీ చాలా ఆచితూచి వ్యవహరించింది. దీంతో పార్టీ నిర్మాణాత్మకంగా తగ్గిపోయింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మోత్కుపల్లి నర్సింహులు సహా అనేకమంది పార్టీ మారిపోయారు. ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తే పార్టీ పుంజుకోవడం కష్టం అనే వాదన వినిపిస్తోంది. మరి చంద్రబాబు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.
This post was last modified on August 27, 2024 11:57 pm
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…
మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…
ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…