వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు ఊరట లభించింది. హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. తాను విదేశాలకు వెళ్లాల్సి ఉందని.. అనుమతి ఇవ్వాలన్న జగన్ పిటిషన్‌పై సానుకూలంగా తీర్పు వెలువరించింది. కొన్నాళ్ల కిందటే దీనికి సంబంధించిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు అప్పట్లో ఇరు పక్షాల వాదనలు(జగన్, సీబీఐ) విని తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం పొద్దు పోయాక.. తీర్పు వెలువరించింది. జగన్ కుటుంబం సహా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అయితే.. అక్రమాస్తుల కేసుల్లో సాక్షులను ఎవరినీ ప్రభావితం చేయరాదని కోర్టు స్పష్టం చేసింది.
ఎక్కడికి వెళ్తారు..?
జగన్ తన కుమార్తెలు చదువుతున్న బ్రిటన్ కు వెళ్లాలని భావిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికలు పూర్తయిన తర్వాత.. ఇదే కారణంతో ఆయన అనుమతి తెచ్చుకుని పది రోజులకు పైగానే అక్కడ పర్యటించి వచ్చారు. ఇప్పుడు మరోసారి బ్రిటన్‌కు వెళ్లేందుకు అనుమతి కోరుతూ పది రోజుల కిందటే హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సీబీఐ వాదనలు వినిపిస్తూ.. కేసులు కీలక దశలో ఉన్నాయని.. విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవాలని.. అనుమతి ఇవ్వొద్దని పేర్కొంది. అంతేకాదు.. విదేశాలకు వెళ్తే.. తిరిగి వస్తారో లేదోనన్న భయం కూడా ఉందని తెలిపింది.
అయితే.. ఇప్పటి వరకు కేసులు నమోదయ్యాక.. ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారు..? ఎన్నిసార్లు తిరిగి వచ్చారు? ఆ సమయం లో ఇబ్బంది పెట్టారా? సాక్షిని ప్రభావితం చేశారా? అన్న వివరాలు సేకరించిన కోర్టు జగన్‌కు తాజాగా అనుకూల తీర్పు వెలువ రించింది. అయితే.. ఇప్పుడు కూడా బెయిల్ నిబంధనలు పాటించాలని.. విదేశాలకు వెళ్తున్న క్రమంలో ముందస్తు సమాచారం ఇచ్చి వెళ్లాలని.. పేర్కొంది. అంతేకాదు.. ఏదేశానికి ఎక్కడికి ఎందుకు వెళ్తున్నారో కారణాలు పేర్కొని.. ఆ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావాలని, వేరే వారిని కలుసుకునేందుకు అనుమతి కోరాలని.. తేల్చి చెప్పింది. కాగా, బ్రిటన్‌లో కుమార్తెలను కలుసుకోవడంతోపాటు.. అక్కడి వైసీపీ ఎన్నారై సెల్‌తో కూడా జగన్ భేటీ కానున్నారు. కానీ, దీనికి అనుమతి తీసుకున్నట్టు తెలియలేదు. ఏదేమైనా.. జగన్‌కు ఒకింత ఊరట అయితే లభించింది.
This post was last modified on August 27, 2024 11:52 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…