టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ‘ఎన్ కన్వెన్షన్’ను కూల్చేయడం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. తుమ్మడిచెరువును ఆక్రమించి కట్టిన ఈ కన్వెన్షన్ సెంటర్ అక్రమమని ఎప్పట్నుంచో ఆరోపణలు ఉన్నాయి.
ఐతే చిన్న వర్షానికే హైదరాబాద్‌లో పలు ప్రాంతాలు, కాలనీలు నీటి మడుగుల్లా మారిపోతుండడానికి చెరువుల ఆక్రమణలే కారణమని.. చెరువులుండాల్సిన చోట్ల కట్టడాలు విపరీతంగా పెరిగిపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోందని భావించి రేవంత్ సర్కారు ఆక్రమణల కూల్చివేతకు నడుం బిగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కట్టడాలను కూల్చివేయగా.. ఇప్పుడు ‘ఎన్’ కన్వెన్షన్ కూడా ఆ జాబితాలోకి చేరింది. ‘ఎన్’ కన్వెన్షన్ కూల్చివేయాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ఎప్పట్నుంచో పోరాడుతోంది. గత ప్రభుత్వ హయాంలో చర్యలు మొదలుపెట్టినట్లే మొదలుపెట్టి ఆపేశారనే ఆరోపణలున్నాయి.
ఐతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెరువులను ఆక్రమించి చేసిన అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతుండగా.. నాగ్ పలుకుబడి దృష్ట్యా ఎలాగోలా తన కన్వెన్షన్ సెంటర్ మీదికి అధికారులు రాకుండా చూసుకుంటాడని భావించారు. కానీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా హైడ్రా అధికారులు ఈ కట్టడాన్ని కూల్చేశారు. ఐతే ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలే కారణం అనే చర్చలు జరుగుతున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా పలు సందర్భాల్లో రేవంత్ ‘ఎన్’ కన్వెన్షన్ గురించి ప్రస్తావించారు.
టీడీపీ ఎమ్మెల్యేగా ఉండగానే చెరువు మధ్యలో గోడ కట్టి మరీ ఈ కన్వెన్షన్ నిర్మించిన విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు రేవంత్. అది అక్రమ కట్టడమని క్లియర్‌గా తెలుస్తున్నా ఎందుకు కూల్చివేయట్లేదని ప్రశ్నించారు. కొన్నేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా మరోసారి మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఎన్ కన్వెన్షన్‌ను కూల్చి తీరుతామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి దీన్ని కూల్చివేయడంతో సోషల్ మీడియాలో సానుకూల స్పందన వస్తోంది.
This post was last modified on %s = human-readable time difference 12:58 pm
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ ఒక దశలో ఫిదా, ఎఫ్-2 తొలి ప్రేమ లాంటి హిట్లతో మంచి ఊపు…
వరుణ్ ధావన్, సమంతా జంటగా నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన…
పొరుగింటి పుల్లకూర రుచి అని తెలుగులో ఓ సామెత ఉంది. ఇది తెలుగు వారికి బాగా నప్పుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి.…
బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రన్ సాధించి నలభై రోజుల తర్వాత ఓటిటిలో వచ్చిన దేవర మీద సోషల్ మీడియాలో…
మొత్తానికి లక్కీ భాస్కర్ సినిమాతో దర్శకుడు వెంకీ అట్లూరి తన బ్రాండ్ ఇమేజ్ ను మార్చేసుకున్నాడు. మొదట్లో వరుసగా తొలిప్రేమ…
విజన్ 2047 లక్ష్యంగా వికసిత ఆంధ్రప్రదేశ్ సాకారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు ముందుకు వెళుతోన్న సంగతి తెలిసిందే. అమరావతిని…