వైసీపీ అధినేత జగన్ ముందస్తు జాగ్రత్తలో పడ్డారు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు సంబంధించి జరుగుతున్న న్యాయ పోరాటంలో ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు అనేక మంది పై కేసులు నమోదయ్యాయి. చాలా మంది కార్యకర్తలు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ముఖ్యమంతైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జోగి రాజీవ్ లు మాత్రమే బెయిల్‌కు వస్తుండగా.. ఆయా కేసుల్లో చిక్కుకున్న చాలా మంది కార్యకర్తలు మాత్రం జైళ్లలోనే మగ్గుతున్నారు.
దీంతో కార్యకర్తల కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. తమకు సాయం చేయాలని కోరుతున్నాయి. దీనికి తోడు.. మద్యం, ఇసుక, గనులకు సంబంధించిన కేసులు ఇంకా పొంచి ఉన్నాయి. వీటిలో ఎప్పుడైనా అరెస్టు సాగే అవకాశం ఉంది. ఈ క్రమంలో అలాంటి సమయంలో న్యాయం సాయం కోసం.. అప్పటికప్పుడు చేతులు చాపకుండా.. ముందుగానే అలెర్ట్ అయ్యారు. కేంద్ర కార్యాలయంలో నిరంతరం అందుబాటులో ఉండేలా ఒక న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
అదేవిధంగా జిల్లాల స్థాయిలో కేసులు వాదించేందుకు.. కార్యకర్తలకు బెయిళ్లు వచ్చేలా.. ముందస్తు బెయిళ్లు సంపాయించుకునేలా చూసేందుకు జిల్లాకో న్యాయ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందాలన్నీ కూడా.., మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నడవనున్నాయి. ఆయన సూచనల మేరకు నడుచుకుని.. పార్టీకి న్యాయ సాయం చేయనున్నారు. వీరిలో ఎక్కువ మంది స్వచ్ఛందంగా సేవ చేసేందుకు ముందుకు వచ్చినట్టు సమాచారం.
అయితే.. కోర్టు ఫీజులు, ఇతర ఖర్చులను మాత్రం వైసీపీ ఇస్తుంది. కార్యకర్తల కుటుంబాలపై కానీ.. కార్యకర్తల పై కానీ.. ఎలాంటి ఆర్థిక భారం లేకుండా చేసుకుంటుంది. తద్వారా వారిలో భరోసా నింపాలని భావిస్తోంది. పిన్నెల్లికి తాజాగా బెయిల్ వచ్చేలా చేయడం వెనుక.. ఇలాంటి కేంద్ర బృందమే సాయం చేసింది. భవిష్యత్తులో మరిన్ని కేసులు నమోదయ్యే ప్రమాదాన్ని గుర్తించిన జగన్.. ఇప్పటి నుంచే జాగ్రత్త పడడం గమనార్హం. తాజాగా వైసీపీ లీగల్ సెల్ నాయకులతో మాట్లాడిన జగన్.. ఈ బృందాలను నియమించే బాధ్యతలను వారికి అప్పగించారు. కాగా, గతంలో చంద్రబాబు కూడా.. జిల్లాకో న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
This post was last modified on August 24, 2024 12:42 pm
ఏపీలోని కూటమి సర్కారు సంక్రాంతి సంబరాల ముంగిట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని దాదాపుగా…
ఇప్పుడంటే సోషల్ మీడియా ఓ రేంజిలో ప్రతాపం చూపుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి తాను కూడా…
ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసి బాబుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వైసీపీ అదికారంలో ఉండగా… సీఐడీ ఛీఫ్ గా…
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఒంటరి ప్రయాణాన్ని తప్పించుకునేలా కనిపించడం లేదు. ఏడాదిన్నర కిందటి వరకు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆకస్మికం గా పర్యటించారు. వాస్తవానికి…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటన సంచలనం రేపింది.…