సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్
కన్వెన్షన్‌పై హైడ్రా పంజా విసిరింది. మాదాపూర్‌లో నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ను శనివారం పొద్దు పొద్దున్నే అధికారులు కూల్చివేత పనులు ప్రారంభించారు. భారీ ఎత్తున పోలీసులు, సిబ్బందితో పహారా ఏర్పాటు చేసి.. ఐదు బుల్ డోజర్‌లతో పనిని చేపట్టారు. దీంతో ఒక్కసారిగా.. ఈ వ్యవహారం.. సంచలనం సృష్టించింది. మాదాపూర్‌లోని తుమ్మిడి చెరువును ఆక్రమించి.. ఈ నిర్మాణం చేశారన్నది ప్రధాన ఆరోపణ.
తుమ్ముడి చెరువుకు సంబంధించి మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారని.. ఇక్కడ ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించారని.. స్థానికులు కొందరు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై గత రెండు రోజులుగా చర్చ సాగుతోంది. సినీ రంగానికి చెందిన వ్యక్తి కావడంతో ఆచి తూచి అడుగులు వేయాలని అధికారులు నిర్ణయించుకున్నా.. రాజకీయంగా వివాదాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని భావించి.. చివరకు కూల్చివేత నిర్ణయం తీసుకున్నారు.
శనివారం ఉదయం నుంచే కూల్చివేత పనులు చేపట్టారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్సిబిలిటీ అథారిటీ(హైడ్రా) ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కూల్చివేతలపై మరోవైపు.. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఉన్న నిర్మాణాలను ఇప్పుడు కూల్చేయడం ఏంటని నిలదీసింది. అదేసమయంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాల్సిందేనని తేల్చి చెప్పింది. అయితే.. ముందుగానే నోటీసులు ఇచ్చి.. సామగ్రిని తరలించుకునేందుకు సంబంధిత వ్యక్తులకు అవకాశం ఇవ్వాలని సూచించింది.
ఈ క్రమంలోనే ఎన్ కన్వెన్షన్‌కు కూడా రెండు రోజుల కిందటే అధికారులు నోటీసులు ఇచ్చారు. అనంతరం కూల్చి వేతలు చేపట్టారు. ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి సుమారు 20 కోట్ల రూపాయలు ఖర్చయినట్టు తెలుస్తోంది. అయితే.. దీనికి ప్రాథమికంగా అనుమతి ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటే బాగుంటుందనేది సినీ వర్గాల మాట.
This post was last modified on August 24, 2024 11:31 am
ఏపీలోని కూటమి సర్కారు సంక్రాంతి సంబరాల ముంగిట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని దాదాపుగా…
ఇప్పుడంటే సోషల్ మీడియా ఓ రేంజిలో ప్రతాపం చూపుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి తాను కూడా…
ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసి బాబుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వైసీపీ అదికారంలో ఉండగా… సీఐడీ ఛీఫ్ గా…
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఒంటరి ప్రయాణాన్ని తప్పించుకునేలా కనిపించడం లేదు. ఏడాదిన్నర కిందటి వరకు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆకస్మికం గా పర్యటించారు. వాస్తవానికి…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటన సంచలనం రేపింది.…