ఉద్యోగుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మార్కు వేరుగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించిన డిమాండ్ల విషయంలోనూ ఆయన వ్యూహాలు వేరేగా ఉంటాయి. ఎంత సేపూ.. పని-పని-పని అంటూ.. ఉరుకులు పరుగులు పెట్టించడం చంద్రబాబు ప్రధాన పాలనా మంత్రాంగం. 1995-2004 వరకు కూడా చంద్రబాబు ఇలానే వ్యవహరించారు. దీంతో రాష్ట్రంలో పరిపాలన పరుగులు పెట్టింది. ఉద్యోగుల విషయంలో ప్రజలపై నమ్మకం కూడా పెరిగింది.
అయితే.. తర్వాత కాలంలో ఇది చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. 2004 ఎన్నికలకు వచ్చేసరికి చంద్ర బాబుకు వ్యతిరేకింగా ఉద్యోగులు పోటెత్తారు. ఫలితంగా వరుస పరాజయం పాలయ్యారు. ఇక, 2014కు వచ్చేసరికి ఎట్టకేలకు పరుచూరు అశోక్‌బాబు వ్యూహంతో చంద్రబాబుకు మరోసారి ఉద్యోగులు చేరువ అయ్యారు. వారికి 43 శాతం ఫిట్‌మెంటు ఇవ్వడంతోపాటు.. హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చి ఉద్యోగాలు చేసేవారికి భారీ ఎత్తున ప్రోత్సాహాలు కూడా ఇచ్చారు.
కట్ చేస్తే.. ఇప్పుడు మరోసారి చంద్రబాబు పాలన వచ్చింది. ఇటీవల ఆయన పదే పదే.. ఒక మాట చెబుతున్నారు. ఉద్యోగులు గుర్తు పెట్టుకోవాలి. మళ్లీ మీరు 1995 నాటి చంద్రబాబును చూస్తారు! అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అంటే.. ఉద్యోగులపై నియంత్రణ పెరుగుతుందని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. సరిగా పనిచేయని వారిని తప్పిస్తానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఉద్యోగ సంఘాలు ఒకరకంగా హడలిపోయాయి. ఇదే జరిగితే.. తమకు ఇబ్బందేనని భావించాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు మారిపోతున్నారని.. 1995 నాటికి సీఎం ఆయనలో కనిపిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, హఠాత్తుగా మరోసారి చంద్రబాబు ఈ విషయంలో వెనక్కి తగ్గారు. సంఘాలకు అనుకూలంగానే నిర్ణయాలు తీసుకునేందుకు మొగ్గు చూపారు. అంతర్గత చర్చల్లో ఏం జరిగిందో ఏమో.. ఉద్యోగుల విషయంలో దూకుడుగా ఉంటే.. ఇబ్బందులు తప్పవని భావించిన చంద్రబాబు.. తాజాగా వారికి అనుకూలమైన నిర్ణయాలే తీసుకుంటాని పరోక్షంగా చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పినమేరకు బదిలీలు, ఇతరత్రా సౌకర్యాలు వారికి కల్పిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనిని బట్టి ఉద్యోగుల విషయంలో చంద్రబాబు మార్కు ఇక లేనట్టేనని తెలుస్తోంది. ఏదేమైనా చంద్రబాబుకు మంచి చేయాలని ఉన్నా.. రాజకీయ ఒత్తిడిలు.. ఓటు బ్యాంకు వంటివి ప్రభావం చూపుతున్నాయని స్పష్టమైంది.
This post was last modified on August 23, 2024 3:21 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…