Political News

చంద్ర‌బాబు విజ‌న్ పాలిటిక్స్‌.. స‌క్సెస్ మంత్రం ఎంత‌.. ?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడుల విషయంపై సర్వోత్రా చర్చ జరుగుతోంది. సాధారణంగా చంద్రబాబు అంటేనే విజన్ కు ప్రతిరూపం. భవిష్యత్తును ముందే ఆలోచించి రాబోయే 10 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ముందుగానే ఊహించి, ఆయన నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం ప్రభుత్వాన్ని నడిపిస్తారని పేరు ఉన్న విషయం తెలిసిందే. 2014లో విభజిత ఏపీలో తొలిసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన చంద్రబాబు దీనిని దృష్టిలో పెట్టుకునే అమరావతి నిర్మాణం చేశారు.

అదేవిధంగా విశాఖపట్నంలో ఐటీ సంస్థలు ఏర్పాటు చేశారు. అనంతపురంలో కియా పరిశ్రమలు తీసుకొచ్చారు. చిత్తూరులో శ్రీ సిటీ వంటి ఇండస్ట్రియల్ ఏరియాను కూడా అభివృద్ధి పథంలో నడిపించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు విజన్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వం అన్నాక సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదా ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయడం కామనే. కానీ చంద్రబాబు విషయానికి వచ్చేసరికి వీటికి భిన్నంగా ఆయన విజన్ అమలు చేస్తారనేది ప్రజల్లో ఉన్నటువంటి పెద్ద ఆశ.

దీనిని ఎప్పుడు అమలు చేస్తారని చాలామంది ఎదురు చూస్తారు. ఇప్పుడు చంద్రబాబు ఆదిశగానే అడుగులు వేస్తున్నారు. గడిచిన 10 రోజులుగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారి కోసం ఆహ్వానాలు పంపడం అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్లిపోయినటువంటి కొన్ని కంపెనీలను తిరిగి పిలిచి పెట్టుబడులు పెట్టండి అని పిలుపునివ్వటం అంటివి ఆసక్తిగా మారాయి. చంద్రబాబు విజన్ అదేవిధంగా ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అందిపుచ్చుకునేందుకు బడా పరిశ్రామిక వేత్తలు కూడా ఇప్పుడు క్యూ కడుతున్నారు.

తాజాగా జిందాల్ కంపెనీ అదేవిధంగా టాటా కంపెనీ ఏపీలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నాయి. అదే విధంగా వైసిపి హయాంలో చిత్తూరు నుంచి వెళ్లిపోయి మరో కంపెనీని తెలంగాణలో ఏర్పాటుచేసిన అమరరాజా సంస్థ కూడా మళ్లీ ఏపీలో మరో సంస్థను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇక గత ఐదేళ్లలో విశాఖలో ఐటీ పరిశ్రమలు ఖాళీ అయిన నేపథ్యంలో వాటిని కూడా తిరిగి తీసుకువచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.

మొత్తంగా చూస్తే చంద్రబాబు విజన్ పెట్టుబడులకు బాగానే పనిచేస్తుందన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు పూర్తయిన నేపథ్యంలో రాబోయే ఆరు మాసాల్లో పెట్టుబడులకు ఒక రూపం సంతరించుకుంటుందని భారీ ఎత్తున పెద్దపెద్ద పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తద్వారా వేల మంది యువతీ యువకులకు ఉపాధి ఉద్యోగాలు లభిస్తాయిని తద్వారా సంపద సృష్టి జరుగుతుందని చంద్రబాబు కూడా భావిస్తూ ఉండడం విశేషం.

This post was last modified on August 22, 2024 10:14 am

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

58 minutes ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

1 hour ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

1 hour ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

1 hour ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

3 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

5 hours ago