ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి వ్యవహారం ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జంట మూడేళ్లకే విడిపోతుందంటూ ఆయన చిత్రమైన లెక్కలేవో వేసి జోస్యం చెప్పడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. గతంలో ఎన్నో పిచ్చి జోస్యాలు చెప్పి నవ్వుల పాలయ్యారు వేణు స్వామి. తెలంగాణ, ఏపీ ఎన్నికల ఫలితాలకు తోడు ప్రభాస్ ఫిలిం కెరీర్ మీద వేణు స్వామి చెప్పిన జోస్యాలు ఏమయ్యాయో అందరికీ తెలిసిందే.
ఐతే వీటి విషయంలో వేణు స్వామిని జనం మరీ అంత సీరియస్‌గా ఏమీ తీసుకోలేదు. కానీ నాగచైతన్య-శోభిత శుభమా అని నిశ్చితార్థం చేసుకుంటుంటే.. వారు విడిపోవడం గురించి మాట్లాడ్డం.. పైగా ఆయన ఏవేవో ఈక్వేషన్లు చెబుతూ శోభిత రాశినే తప్పుగా చెప్పడంతో సోషల్ మీడియా నుంచి తీవ్రమైన వ్యతిరేకత తప్పలేదు. దీనిపై తెలంగాణ మహిళా కమిషన్‌కు తెలుగు ఫిలిం జర్నలిస్టులు ఫిర్యాదు చేయడం.. మరోవైపు టీవీ5 మూర్తి చర్చా కార్యక్రమంలో భాగంగా వేణు స్వామి లీలలన్నింటనీ బయటపెట్టడంతో వ్యతిరేకత ఇంకా పెరిగిపోయింది.
ఐతే అన్ని వైపులా వ్యతిరేకతను గమనించి ఈ వ్యవహారంలో క్షమాపణ చెప్పి ముందుకు సాగిపోవాల్సింది వేణు స్వామి. కానీ ఆత్మహత్య చేసుకుంటానంటూ భార్యతో కలిసి పెట్టిన వీడియోతో వేణు స్వామి ఇంకా ఇరుక్కుపోయారు. తమను ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నారంటూ జర్నలిస్టుల మీద ఆరోపణలు చేయడం మరింత వివాదాస్పదం అయింది. అందరి జోస్యాలు చెప్పే వేణు స్వామికి.. తన జాతకంలో ఆత్మహత్య రాసి ఉందా.. తన చావు గురించి ఏం తెలియదా.. ఈ సమస్యకు పరిష్కారం కూడా జ్యోతిష్యంలోనే వెతుక్కోవచ్చు కదా అని సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. అసలే వేణు స్వామి మీద ఆగ్రహంతో ఉన్న జర్నలిస్టులు.. తాజా ఆరోపణలతో ఆయన్ని అంత తేలికగా వదలకూడదని ఫిక్సయ్యారు. ప్రెస్ మీట్ పెట్టి వేణుస్వామికి వార్నింగ్స్ ఇచ్చారు.
మూర్తి సహా కొందరు జర్నలిస్టులు వేణు స్వామి చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేస్తూ ఆయన మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను 5 కోట్లు డిమాండ్ చేశారంటూ వేణు స్వామి, ఆయన భార్య రిలీజ్ చేసిన ఆడియో కాల్ కూడా రియల్ కాదనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. దీని మీదా జర్నలిస్టులు విచారణ కోరుతున్నారు. ఇదే సమయంలో వేణు స్వామి గతంలో చెప్పిన జోస్యాలు.. ఆయన మాట్లాడిన కాల్స్‌కు సంబంధించిన ఆడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవన్నీ ఆయన ఇమేజ్‌ను బాగా డ్యామేజ్ చేస్తున్నాయి. చూస్తుంటే వేణు స్వామి ఈ వ్యవహారంలో పీకల దాకా ఇరుక్కుపోయి.. క్రెడిబిలిటీని పూర్తిగా దెబ్బ తీసుకుని జ్యోతిష్యంలో తనకు కెరీరే లేకుండా చేసుకున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
This post was last modified on August 21, 2024 2:46 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…