తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ రైస్ లో మరో కొత్త పేరు వచ్చి చేరింది. నిన్న మొన్నటి వరకు సినిమా దర్శకులు, నిర్మాతలు పోటీపడుతున్నారనేది తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక టీవీ ఛానల్ అధినేతకు చంద్రబాబు నాయుడు చైర్మన్ పదవిని ఖరారు చేశారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇది అధికారికంగా కాదు. ప్రచారం అయితే బాగా జరిగింది. దీనిపై టిడిపి నాయకులు ఎవరూ కూడా స్పందించలేదు. ఇక ఇంకేముంది అయిపోయింది మరికొద్ది రోజుల్లో నామినేటెడ్ టీటీడీ బోర్డును నిర్మించేస్తున్నారని అనుకుంటున్న సమయంలో మరోసారి ఈ బోర్డు విషయంలో చంద్రబాబు నిర్ణయం మారినట్టు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఎన్వి రమణ పేరు ఇప్పుడు టిటిడి చైర్మన్ రేస్ లో ముందంజలో ఉందని అంటున్నారు. ప్రస్తుతం అనధికారికంగా జరుగుతున్న ప్రచారం ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవిని తనకు ఇవ్వాలని ఇటీవల అమరావతిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ ఎన్వి రమణ ముఖ్యమంత్రిని కోరారని దీనికైనా ప్రాథమికంగా అంగీకారం తెలిపారని అంటున్నారు. దీనిపై అనేక కోణాల్లో చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.
ఎందుకంటే ఏడాది కిందటి వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వి రమణకు ఇప్పుడు అనూహ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇస్తే న్యాయపరమైన చిక్కులు ఏమైనా వస్తాయా లేకపోతే రాజకీయంగా ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయా అనే ఆలోచన చేస్తున్నారనేది ఒక భాగం. అయితే మరోవైపు ఈ పదవిని ఆశిస్తున్న వారిని సంతృప్తి పరచడం వారిని బుజ్జగించడం కూడా టైం పట్టే అవకాశం ఉందని మరో చర్చ నడుస్తుంది.
ఎలా చూసుకున్నా టిటిడి చైర్మన్ పదవి విషయంలో అనేకమంది పేర్లు తెరమీదకి రావడం వీరిలో పక్కన పెట్టలేని స్థాయిలో కొంతమంది ప్రయత్నాలు చేయడం వంటివి నిజానికి చాలా చర్చనీయాంశంగాను అలాగే టిటిడి చైర్మన్ పదవి ప్రాధాన్యాన్ని మరింత ఆసక్తిగాను మార్చాయి. చివరకు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. జస్టిస్ ఎన్వి రమణ వ్యక్తిగతంగా చూసుకుంటే దైవ భక్తి ఉన్న మాజీ న్యాయమూర్తి. అదే విధంగా సౌమ్యుడు, వివాద రహితుడు, ఎట్లాంటి ఆరోపణలు లేనటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ఇవ్వడానికి ఎవరూ తప్పు పట్టుకపోయినా కానీ పార్టీలోనూ ఇతర రంగాల్లోనూ ఈ పదవి కోసం ఎదురుచూస్తున్న వారు చాలామంది ఉన్న నేపథ్యంలో జస్టిస్ ఎన్వి రమణకు ఎంత మేరకు చంద్రబాబు ముగ్గు చూపుతారు అనేది చూడాలి.
This post was last modified on August 21, 2024 12:31 pm
కంగువ విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ సందర్భంలో మాట్లాడుతూ తమ సినిమా రెండు వేల కోట్లు వసూలు…
టాలీవుడ్ లోనే కాదు అటు ఉత్తరాదిలోనూ మోస్ట్ వెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీగా విపరీతమైన అంచనాలు మోస్తున్న పుష్ప 2…
సెలబ్రెటీలు ఏం చేసినా వార్తే. అలాంటిది ఒక స్టార్ హీరో వైన్ షాపుకి వెళ్లి మద్యం కొంటే అంతకంటే వార్త…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న భారీ చిత్రానికి డాకు మహారాజ్ టైటిల్ నిర్ణయించారు. ఈ లీక్…
పాపం దురదృష్టాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నట్టు ఉంది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పరిస్థితి. రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా…
ఇద్దరి హీరోల అభిమానులు ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ 4 బాలకృష్ణ, బన్నీల ఇంటర్వ్యూలో మొదటి భాగం నిన్న అర్ధరాత్రి…