ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ఉమ్మడి కృష్నాజిల్లాలోని గుడివాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో తొలి అన్న క్యాంటీన్ను అధికారికంగా ప్రారంభించనున్నారు. క్యాంటీన్ ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి చెత్త చెదారం లేకుండా శుభ్రం చేశారు. క్యాంటీన్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు, క్యాంటీన్ కు ఎడం వైపున వేదిక, ర్యాంపు, నీడ కోసం షెడ్ నిర్మాణం, ఆవరణలో మొక్కలు నాటారు. క్యాంటీన్ ప్రారంభించాక.. సీఎం చంద్రబాబు తొలిసారి గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం కానున్నారు.
వేదిక వద్ద అన్ని సౌకర్యాలతో కూడిన అంబులెన్సులు, వైద్యులు, మందులు సిద్ధంగా ఉంచారు. వేదిక అలంకరణ, బ్యాక్ డ్రాప్ స్క్రీన్, సూచిక బోర్డుల ఏర్పాటు, విద్యుత్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా జనరేటర్ల ఏర్పాటు చేశారు. ఇక, కీలకమైన ముఖ్యమంత్రి రాకపోకల సమయంలో ట్రాఫిక్ నియంత్రణ, భద్రత ఏర్పాట్లపై ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కీలకమైన నియోజకవర్గం కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గట్టి పోలీసు బందోబస్తు చేపట్టారు.
అసలు విషయంపైనే ఆసక్తి
అన్న క్యాంటీన్ ప్రారంభించేందుకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించనున్నారు. అయితే.. ఈ నియోజకవర్గానికి, మిగిలిన నియోజకవర్గాలకు చాలా తేడాఉంది. గతంలో వైసీపీ మంత్రిగా ఉన్న ఇక్కడి ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని పరుషంగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను ఎట్టి పరిస్థితిలోనూ ఓడించాలన్న సంకల్పంతో చంద్రబాబు ఎన్నారై వెనిగండ్ల రాముకు ఈ టికెట్ ఇచ్చారు. మొత్తానికి ఓడించారు.
ఈ నేపథ్యంలో తాజా సమావేశంలో చంద్రబాబు ఏం చెబుతారు? కొడాలికి ఎలాంటి వార్నింగ్ ఇస్తారు? ఆయన హయాంలో కేసినో.. పేకాట క్లబ్బులకు ఆలవాలంగా మారిన గుడివాడలో ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలను చేపట్టేందుకు శ్రీకారం చుడతారన్న చర్చ జోరుగా సాగుతోంది. అదేవిధంగా చంద్రబాబు గెలిస్తే.. తాను ఆయన బూట్లు తుడుస్తూ.. ఆయన పాదాల దగ్గరే పడి ఉంటానని గతంలో కొడాలి శపథం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు ఆ శపథాన్ని గుర్తు చేస్తారా? అనే చర్చ జోరుగా సాగుతోంది.
This post was last modified on August 15, 2024 10:04 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…