ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన వ్యవహారం రాజకీయ దుమారానికి దారి తీసింది. తనపై కేసు పెట్టిన వారిని ఊరుకునేది లేదని నాగేందర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అధికారులకు ప్రవిలేజ్(శాసన సభా హక్కులు ఉల్లంఘించడం) నోటీసులు ఇస్తానని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.
అసలు ఏం జరిగింది?
గత శనివారం.. ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని జూబ్లీహిల్స్ డివిజన్‌లో ఉన్న నందగిరిహిల్స్‌లో పార్క్ గోడను స్థానికులు కొందరు కూలగొట్టారు. అయితే.. దీనిని సీరియస్‌గా తీసుకున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. గోడకూల్చివేసిన ఘటన వెనుక ఎమ్మెల్యే ప్రోద్బలం ఉందని గుర్తించారు. ఎమ్మెల్యే దూకుడు కారణంగానే స్థానికులు కొందరు పార్కు స్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారని, ఈ క్రమంలోనే పార్కు గోడను కూలదోశారని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు.
ఈ క్రమంలో స్థానికులు సహా ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు పార్కు ఆక్రమణదారులను కావాలని రెచ్చగొట్టారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన నాగేందర్.. జీహెచ్ఎంసీ అధికారులపై నిప్పులు చెరిగారు. గోడ కూల్చివేత, తనపై నమోదైన కేసు అంశంపై ఆయన ఫైరయ్యారు. సంబంధిత అధికారులకు ప్రివిలైజ్ నోటీస్ ఇస్తానని హెచ్చరించారు. అసలు ఏం జరిగిందో తెలుసా? అని ప్రశ్నించారు.
వాస్తవాలు తెలుసుకోకుండా అధికారులు కళ్లు మూసుకుని పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించిన దానం.. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. “నందగిరిహిల్స్‌లో పార్కు గోడ కారణంగా స్థానికులు ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది. దీంతో నేను అక్కడకు వెళ్లా. ఇది నా నియోజకవర్గం. నేను వెళ్లే హక్కు నాకుంది. నన్ను అడ్డుకునే అధికారం ఏ అధికారికీ లేదు. ప్రజాప్రతి నిధిగా ప్రజల సమస్యలు తీర్చడమే నా బాధ్యత” అని దానం అన్నారు. అంతేకాదు.. ఇలాంటి కేసులు తనకు కొత్తకాదని, ఎన్నో చూశానని చెప్పుకొచ్చారు.
This post was last modified on August 13, 2024 5:11 pm
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…