రాష్ట్రంలో చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి.. ఈ నెల 12(సోమవారం)కు రెండు మాసాలు పూర్తవుతాయి. జూన్ 12న ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేశారు. మరి ఈ రెండు మాసాల కాలంలో చంద్రబాబు తనదైన మార్కు, మార్పు చూపించారా? అంటే.. చూపిస్తున్నారనే చెప్పాలి. ఒకే రోజు మార్పు సాకారం కాదు. సో.. ఈ రెండు మాసాల్లో చంద్రబాబు వేసిన అడుగులు చూస్తే.. వచ్చే రెండేళ్లకు కావాల్సిన వనరులను ఆయన ఎలా సమకూర్చుకుంటున్నారన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.
ఒక వైపు అభివృద్ధి-మరో వైపు సంక్షేమం ఈ రెండు అంశాలను ప్రధానంగా తీసుకుని చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. రాజధాని అమరావతికి సంబంధించి ఇప్పటికే జంగిల్ క్లియరన్స్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఇది ప్రస్తుతం కొనసాగుతోంది. ఇదేసమయంలో కేంద్రం నుంచి రూ.15 వేల కోట్ల చొప్పున రుణం ఇప్పించేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇది కాకుండా.. మరో 15 వేల కోట్ల అప్పు కోసం. ప్రభుత్వం ప్రపంచ బ్యాంకును అభ్యర్థించింది.
దీంతోప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కూడా తాజాగా అమరావతిలో పర్యటించారు. ఇక్కడ జరుగుతున్న, నిలిపివేసిన పనులను కూడా వారు పరిశీలించారు. దీంతో అమరావతి ఒక కొలిక్కి వచ్చింది. ఇక, పోలవరం విషయాన్ని కేంద్రానికి వదిలిపెట్టారు. అది కూడా సాకారం కానుంది. మరోవైపు ప్రజల నైపుణ్యాలను తెలుసుకునేందుకు, వారికి ఉపాధి, ఉద్యోగాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నైపుణ్య గణను కూడా చేపట్టారు. ఇది కొంత వరకు మేలు చేస్తుంది. దీనికి తోడు డీఎస్సీ వేశారు. ఇలా.. అభివృద్ధి పరంగా ముందుకు సాగుతున్నారు.
మరోవైపు.. సంక్షేమాన్ని తీసుకుంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించి.. ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా పెంచిన ఫించన్లను ప్రతి నెలా 1నే ఠంచనుగా అందిస్తున్నారు. ఇక, మిగిలిన వాటిలో కీలకమైన.. అన్న క్యాంటీన్లను మరో రెండు రోజుల్లోనే ప్రారంభించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా విడతల వారీగా ఇవి ఏర్పాటు కానున్నాయి. మరోవైపు మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పించేందుకు అధ్యయనం జరుగుతోంది. ఇలా.. ఇటు సంక్షేమాన్ని కూడా రెండో చేత్తోముందుకు తీసుకు వెళ్తున్నారు.
This post was last modified on August 12, 2024 11:08 am
ఏపీలో అధికార కూటమి మిత్ర పక్షాల మధ్య వక్ఫ్ బిల్లు వ్యవహారం.. తేలిపోయింది. నిన్న మొన్నటి వరకు దీనిపై నిర్ణయాన్ని…
హెడ్డింగ్ చూసి ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా. నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా భార్య వార్దా ఖాన్ వరస చూస్తే మీకూ…
టాలీవుడ్ కే కాదు మొత్తం భారతదేశ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ ఇప్పటికే…
మచిలీపట్నం మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణరావు.. తన యాక్టివిటీని తగ్గించారు. ఆయన పార్టీలో ఒకప్పుడు యాక్టివ్…
టెక్ జనమంతా సింపుల్ గా శామ్ ఆల్ట్ మన్ అని పిలుచుకునే శామ్యూల్ హారిస్ ఆల్ట్ మన్… భారత్ లో…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే మోస్ట్ వయొలెంట్ మూవీగా చెప్పబడుతున్న ది ప్యారడైజ్ ఇంకా రెగ్యులర్ షూటింగ్ కి…