ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో కీలక నేతగా చక్రం తిప్పుతున్న మాజీ ఎంపీ.. సుదీర్ఘ రాజకీయ అనుభవం, విస్తృత పరిచయాలు ఉన్న మాగంటి కుటుంబంలో రాజకీయాలు అనూహ్యంగా మారిపోయా యి. ఆయన సైకిల్ దిగుతున్నారనే ప్రచారం ఇటీవల కాలంలో ఊపందుకున్నా.. అలాంటివన్నీ.. బూటకమని, వెబ్ మీడియాకు పనీపాటా లేకుండా రాతలు రాస్తోందని ఈసడించుకున్న టీడీపీలోని ఓ వర్గం.. తాజాగా వెలువడుతున్న సంకేతాలతో షాక్‌కు గురవుతోంది. అజాత శతృవుగా పేరు తెచ్చుకున్న మాగంటి బాబు.. టీడీపీకి పెద్ద ఎస్సర్టే అనడంలో సందేహం లేదు.
ఆయన రాజకీయంగా దూకుడు చూపించడంలోను, కార్యకర్తలనుకలుపుకొని పోవడంలోనూ తనదైన శైలిని ప్రదర్శించారు. ఎన్నికల సమయంలోనూ ఆర్థికంగా పార్టీకి అండగా నిలిచేవారు. అయితే, ఆయన గత కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు చెందిన వ్యాపారానికి అనుమతులు ఇచ్చే విషయం సహా.. తన కుమారుడి రాజకీయ భవితవ్యంపైనా ఆయన దిగులు పెట్టుకున్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా.. తాను ఎంపీగా ఉన్న సమయంలోనే తన వ్యాపార విస్తరణకు అనుమతి ఇవ్వాలని ఒత్తిడి చేసినా.. రేపు చూద్దాం.. మాపు చూద్దాం.. అంటూ దాటవేశారు. తీరా ఎన్నికలు అయ్యాక… వైసీపీ అధికారంలోకి వచ్చింది.
పోనీ. వ్యాపారాలను పక్కన పెడితే..కుమారుడు రాంజీ విషయాన్నయినా పట్టించుకుని హామీ ఇవ్వాలని ఆయన బాబు ను కోరారు. ఈ విషయంలోనూ బాబు మౌనంగానే ఉన్నారు. మరో పక్క, మాగంటి ఆరోగ్యం కూడా ఇబ్బందిగా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన అసంతృప్తిని గమనించిన వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మాగంటి మిత్రుడు.. ఒకరు మా పార్టీలోకి వచ్చెయ్.. అంతా సీఎం చూసుకుంటారు. అని హామీ ఇచ్చారని, దీంతో మాగంటి ఫ్యామిలీ పార్టీ మారేందుకు రెడీ అయిందని అంటున్నారు. దీనికి పార్టీ కూడా ఓకే చెప్పిందని తెలిసింది. ఇక.. వీటిని బలపరుస్తున్నాయా? అన్నట్టుగా.. కొన్ని సంకేతాలు వెలుగు చూశాయి.
రెండు రోజుల కిందటి వరకు మాగంటి ఇంటిపై ఎగిరిన… టీడీపీ జెండా మాయమైంది. అదేవిధంగా ఏలూరులోని ఆయన నివాసానికి అర కిలోమీటరు పరిధిలో ఏర్పాటు చేసిన ఫెక్సీలు కూడా తీసేశారు. ఇదిలావుంటే, ఆయన కుమారుడు నిత్యం ఏలూరులోని మంత్రి ఆళ్లనాని నివాసానికి చక్కర్లు కొడుతున్నారని తెలుస్తోంది. ఈ సంకేతాలను గమనిస్తే… మాగంటి పార్టీ మార్పు ఖాయమేనని… ఇది పుకారు కాదని పరిశీలకులు చెబుతున్నారు. చిత్రం ఏంటంటే.. ఇంత జరుగుతున్నా.. చంద్రబాబు మౌనం పాటించడం. ఇప్పటి వరకు వెళ్లిపోయిన నాయకుల విషయంలోనూ ఇలానే చేతులుకాలే వరకు బాబు ఎదురు చూశారని.. ఇప్పుడు కూడా ఇంతేనని అంటున్నారు.
This post was last modified on September 26, 2020 1:16 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…
యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…
తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…