Political News

సుజ‌నా దూకుడు.. మామూలుగా లేదుగా..!

తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రి దూకుడు మామూలుగా లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి ఆయ‌న టికెట్ ద‌క్కించుకుని పోటీకి రెడీ అయిన‌ప్పుడు.. అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆయ‌న ఇక్క‌డ ఉండ‌ర‌ని.. ఢిల్లీలోనో.. బెంగ‌ళూరులోనో.. హైద‌రాబాద్‌లోనో మ‌కాం వేస్తార‌ని.. నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు త‌మ క‌ష్టాలు చెప్పుకొనేందుకు ఫ్లైట్‌లు బుక్ చేసుకోవాల‌ని వైసీపీ నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ముఖ్యంగా జ‌న‌సేన మాజీ నాయ‌కుడు పోతిన మ‌హేష్ అయితే మ‌రింత ఎక్కువ‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు. సుజ‌నా చౌద‌రిని కార్న‌ర్ చేసుకుని తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. అయితే.. ఆ విమ‌ర్శ‌ల‌కు చెక్ పెడుతూ.. సుజ‌నా త‌న దూకుడు కొన‌సాగిస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన త‌ర్వాత‌.. తొలి నెల‌లో అంటే.. జూన్ 5- జూలై 5 మ‌ధ్య కాలంలో నియోజ‌క‌వ‌ర్గంలో చేసిన అభివృద్ధిని పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. నియోజ‌క‌వ‌ర్గంలోని కీల‌క సెంట‌ర్ల‌లో భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

తాను ఈ నెల రోజుల కాలంలో ఏం చేశానో.. చూడండి! అంటూ.. నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు సుజ‌నా చౌద‌రి వివ‌రించారు. దీంతో అప్ప‌టి వ‌ర‌కు విమ‌ర్శ‌లుచేసిన వారికి ఆయ‌న త‌న‌దైన శైలిలో స‌మాధానం చెప్పేశా రు. ఇక‌, ఇప్పుడు రెండో నెల‌కు వ‌చ్చేసరికి.. ఈ రెండో నెల‌లో కూడా తాను నియోజ‌క‌వ‌ర్గానికి చేసిన మేళ్ల‌ను వివ‌రిస్తూ..ప్లెక్సీల రూపంలో వివ‌రించారు. ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో వాటిని ఏర్పాటు చేశారు. దీనికి తోడు.. తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

అదే.. జాబ్ మేళా! ఈ నెల 10న నియోజ‌క‌వ‌ర్గంలోని పార్టీ కార్యాల‌యం జాబ్ మేళా నిర్వ‌హిస్తున్న‌ట్టు ఆయ‌న ప్ర‌చారం చేస్తున్నారు. సుజ‌నా ఫౌండేష‌న్ త‌ర‌ఫున ప‌లు కంపెనీలను ఆహ్వానించిన‌ట్టు తెలిపారు. యువ‌తీ యువ‌కులు.. నిరుద్యోగులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సుజ‌నా కోరారు. ఉద‌యం 10 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు కూడా.. ఇది కొన‌సాగుతుంద‌ని వివ‌రించారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. సుజ‌నా ఇక్క‌డ ఉండ‌డు… ఆయ‌న‌ను గెలిపిస్తే ఫ్లైట్ బుక్ చేసుకోవాల‌ని.. విమ‌ర్శించిన వారికి సుజ‌నా బ‌లంగానే స‌మాధానం చెబుతున్న‌ట్టు తెలుస్తోంది.

This post was last modified on August 10, 2024 11:04 am

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

19 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

27 minutes ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

42 minutes ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

43 minutes ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

3 hours ago