వైసీపీ ఎమ్మెల్సీ, ఫైర్ బ్రాండ్ నాయకుడు, ప్రస్తుతం కుటుంబ వివాదాలతో తెరమీదికి వచ్చి.. నెటిజన్లతో ముద్దుల మొగుడుగా ట్రోల్ అవుతున్న దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం బిగ్ ట్విస్ట్ తెరమీదికి వచ్చింది.
వివాదానికి కేంద్ర బిందువుగా దువ్వాడ సతీమణి వాణి, ఆయన కుమార్తెలు చెబుతున్న మరో మహిళ, దువ్వాడతో సహజీవనం చేస్తున్న దివ్వెల మాధురి తాజాగా మీడియా ముందుకు వచ్చారు. సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.
‘దువ్వాడే నా సర్వస్వం’ అని ఒక్కమాటతో తేల్చి పారేశారు. తమది అక్రమ సంబంధం కాదని తెలిపారు. క్యారెక్టర్ లేని మహిళగా తనను ప్రచారం చేస్తున్నారని కానీ ఎవరికి క్యారెక్టర్ లేదో ఆలోచిం చుకోవాలని వ్యాఖ్యానించారు.
తమ తండ్రి వేరే మహిళతో ఉంటున్నాడంటూ దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు గురువారం రాత్రి ఆయన ఇంటి ముందు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇది ప్రధాన మీడియాలోనూ జోరుగా వైరల్ అయింది. దీనికి కౌంటర్‌గా మాధురి మీడియా ముందుకు వచ్చారు.
ఈ క్రమంలో దువ్వాడ సతీమణి వాణిపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. “అసలు భర్తను వద్దనుకున్నదే వాణి. తనకు అసెంబ్లీ టికెట్ ఇస్తే చాలనుకుంది. భర్త కన్నా ఆమెకు అసెంబ్లీ సీటే ఎక్కువైంది” అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తాను కష్టాల్లో ఉన్నప్పుడు శ్రీనివాస్ ఎంతో ఆదుకున్నారని కూడా తెలిపారు. “నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ సందర్భంలో శ్రీనివాస్ అండగా ఉన్నారు” అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. దువ్వాడ తనకు ‘ఓ ఫ్రెండ్, ఫీలాసపర్.. ఇంకా అన్నీ’ అంటూ మాధురి కన్నీరు పెట్టుకున్నారు. దువ్వాడ అత్యంత నిజాయితీ పరుడని పేర్కొన్నారు. తాను ఎలాంటి ట్రాప్ చేయలేదని.. అయినా దువ్వాడ దగ్గర ఎలాంటి ఆస్తులు లేవని, ప్రస్తుతం ఆయన అప్పుల్లో ఉన్నారని మాధురి చెప్పారు. “ఆయనకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబానికి రాసిచ్చారు. నేను ఏం ఆశించి ట్రాప్ చేస్తాను” అని మాధురి ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దువ్వాడ కోసం తానే భారీగా డబ్బులు ఖర్చు చేసినట్టు ఆమె చెప్పారు. ఈ విషయం వైసీపీ వారికి కూడా తెలుసునన్నారు. “సహజీవనం చేసే హక్కు నాకుంది. మాది అక్రమ వ్యవహారం కాదు. వాణి నా పై నోరు పారేసుకోవడం సరికాదు” అని వార్నింగ్ ఇచ్చారు.
This post was last modified on August 10, 2024 6:16 am
నిన్న చెన్నైలో జరిగిన మదగజరాజ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విశాల్ లుక్స్ చూసి అందరూ షాక్ తిన్నారు.…
ప్రతి సంవత్సరం జపాన్‌లో నూతన సంవత్సరం వేళ అరుదైన చేపల వేట విశేషంగా నిలుస్తుంది. ఈసారి టోక్యోలోని ప్రముఖ చేపల…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై ఐపీఎస్ మాజీ అధికారి.. జగన్ ప్రభుత్వంలో పూర్తిగా సస్పెన్షన్‌కు గురైన ఆలూరి బాల…
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిత్యం ఏదో ఒక ఇన్ఫెక్షన్.. వైరస్ లాంటివి అందరినీ భయపెడుతున్నాయి. ఇది మనకు సోకడానికి ముఖ్య…
హీరోయిన్లు రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్షను వెల్లడించడం.. అందుకు అనుగుణంగానే సినిమాల్లో కెరీర్ ముగుస్తున్న దశలో ఆ రంగంలోకి అడుగు పెట్టడం…
తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన కొనసాగుతూనే ఉంది. అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భక్తులకు-భగవంతుడికి మధ్య టీటీడీ బోర్డు ఉంటుంది.…